అనుష్క కోరిక తీర్చుతున్న మెగా స్టార్

అనుష్క కోరిక తీర్చుతున్న మెగా స్టార్

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’తరువాత కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడు.సోషల్ మేసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బలమైన కథని రెడీ చేసిన కొరటాల,ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజెషన్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో,హీరోయిన్ పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండేలా రాశాడట.అందుకే చిరూ పక్కన అనుష్క అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట కొరటాల.ఇప్పటికే స్వీటీకి లైన్ చెప్పిన కొరటాల,త్వరలో పూర్తి కథని నేరెట్ చేయబోతున్నాడట.అనుష్కకి కూడా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది కాబట్టి దాదాపు ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే అవకాశాలే ఉన్నాయి.అన్నీ సెట్ అయితే 13 ఏళ్ల తర్వాత అనుష్క చిరు పక్కన కనిపించడం ఇదే మొదటిసారి అవుతుంది.గతంలో స్టాలిన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అనుష్క చిరుతో చిందేసింది.hiranjeevi 151 moviఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ని జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్న కొరటాల శివ,చిరూ-అనుష్క డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోని జులై మొదటి వారంలో ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా మొదలు పెట్టాలని చూస్తున్నాడు.అయితే ఇండస్ట్రీవర్గాల టాక్ ని బట్టి చూస్తే,కొరటాల సిద్ధం చేసిన కథలో చిరు డ్యూయల్ రోల్ ప్లే చేస్తాడని తెలుస్తోంది.మరి ఒక హీరోయిన్ గా అనుష్క ఫిక్స్ అయితే రెండో హీరోయిన్ గా కొరటాల ఎవరిని సెట్ చేస్తాడో చూడాలి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *