వర్మకి కాంప్లిమెంట్స్ ఇచ్చిన నాగబాబు

వర్మకి కాంప్లిమెంట్స్ ఇచ్చిన నాగబాబు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు… ఇది అక్షర సత్యమని మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ప్రూవ్ చేశాడు. జనసేనకి, పవన్ కళ్యాణ్ కి మద్దతుగా గ‌త కొన్ని రోజులుగా నాగ‌బాబు తెలుగు దేశం పార్టీని, దానికి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా వరస వీడియోల‌తో నాగ‌బాబు చేస్తున్న హంగామా అయితే మామూలుగా లేదు. టీడీపీని విమర్శించే విషయంలో నాగబాబు కాస్త స్పీడ్ పెంచాలనుకున్నాడో ఏమో కానీ… శత్రువు, శత్రువు మనకి మిత్రుడన్నట్లు… గత కొంత కాలంగా టీడీపీని, చంద్రబాబును, నందమూరి ఫ్యామిలీని ఇరకాటంలో పడేసిన రామ్ గోపాల్ వర్మతో కలిశాడు.

ram gopal varma lakshmi's ntr

నాగబాబు ఏంటి? కలవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.. నాగబాబు కలిశాడు అంటే లిటరల్ గా వెళ్లి మీట్ అయ్యాడని కాదులెండి, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు టార్గెట్ గా వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి సపోర్ట్ ఇచ్చాడు. వర్మ అంటే అసలు పడని నాగబాబు ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన నాగబాబు “నాకు రాంగోపాల్ వ‌ర్మ అంటే గౌర‌వం కానీ ఇష్టం కానీ లేవు. కానీ ఓ ద‌ర్శ‌కుడిగా ఆయ‌న్ని ఇష్ట‌ప‌డ‌తాను. ప్ర‌స్తుతం ఆయ‌న తెర‌కెక్కిస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా నిజాల‌ను నిర్భ‌యంగా వెల్ల‌డిస్తార‌ని న‌మ్ముతున్నాను. అలా చేస్తే సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు. నాగబాబు నుంచి వర్మపై పాజిటివ్ కామెంట్ రావడం, దర్శకుడిగా అతన్ని ఇష్టపడతానని చెప్పడం సినీ అభిమానులకి స్వీట్ షాక్ ఇచ్చింది. ముందు ముందు ఇద్దరూ కలిసే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి ప్రమోషన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే అంటారు… శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *