ప్రపంచ బాక్సింగ్ చరిత్రపై...మేరీ కోమ్ రికార్డ్ పంచ్

ప్రపంచ బాక్సింగ్ చరిత్రపై...మేరీ కోమ్ రికార్డ్ పంచ్

మేరీ కోమ్ ఇపుడొక సంచలనం. వరుస విజయాలతో బాక్సింగ్ చరిత్రపై పంచ్ ఇస్తున్న భారతీయ మహిళ. ఇపుడు కొత్తగా 48 కిలోల బాక్సింగ్‌ విభాగంలో వరుసగా ఆరుసార్లు గెలిచిన రెండో వ్యక్తిగా నిలిచారు.

Mary Kom the champion

రికార్డు ఛాంపియన్!

ఈరోజు( 24న) జరిగిన 48 కిలోల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గేమ్‌లో మేరీకోమ్ ఉక్రేయిన్ బాక్సర్ హన్నా ఒఖోటాను ఓడించి వరుసగా ఆరవసారి టైటిల్‌ని కైవసం చేసుకుంది. 48 కిలోల విభాగంలో ఈ ఘనతను సాధించిన రెండో వ్యక్తిగా రికార్డు సాధించింది. గతంలో క్యూబా లెజెండ్ ఫెలిక్స్ సావోన్ ఈ ఘనత సాధించాడు. సావోన్ తన బాక్సింగ్ జీవితంలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

ఇంతకుముందు ఒకసారి…

మేరీ కోమ్ …ఉక్రేయిన్ బాక్సర్ హన్నా ఒఖోటాను గతంలో పోలాండ్‌లో జరిగిన గేమ్‌లో ఓడించింది. హన్నా ఉక్రేనియా జూనియర్ ఛాంపియన్ గెలిచిన మహిళ. యూత్ వరల్డ్ ఛాంపియన్ గేమ్‌లో రజతం కూడా గెలిచింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *