చేపల పులుసు ఖరీదు మూడు నిండు ప్రాణాలు

చేపల పులుసు ఖరీదు మూడు నిండు ప్రాణాలు
ఒకప్పుడు మనిషి కోపం ఖరీదు విడిపోవడం. టెక్నాలజీ పెరగడం వల్ల ఇప్పటి కోపం ఖరీదు ప్రాణం అవుతోంది. అర్థం కాలేదు కదా..! ఒకప్పుడు ఎవరిమీదైనా కోపం వస్తే ఆ వ్యక్తికి దూరంగా ఉండిపోవడం జరిగేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో…ఇప్పుడు ఎవరితోనైనా గొడవపడితే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడ్డం లేదు. ఏమీ చేయలేని నిస్సహాయత నుంచే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఓ మహిళ తన అత్తతో గొడవపడి ఆమెను ఏమీ అనలేక మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం ప్రయత్నించింది. అయితే, ఆమె మాత్రమే ఈ పని పూనుకుంటే సరిపోయేది కానీ తనతో పాటు తన బిడ్డలకు కూడా విషమివ్వడం క్షమించరాని విషయం. అసలు సంగతిలోకి వెళ్తే…
 
తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనం ప్రాంతానికి చెందిన మహిళ అమ్ము…తనతో పాటు తన బిడ్డలైన కమలేష్(8), యోగేష్(2) ఇద్దరు కొడుకులతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు బిడ్డలు చనిపోగా ఆమె ప్రాణాలకోసం కొట్టుమిట్టాడుతోంది. అమ్ము భర్త ప్రభు(32) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. రెండు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. 
 
married women suicide

చేయనని.. 

ఈ క్రమంలో…ఆదివారం రోజున అమ్ము అత్తగారైన మీన(55) చేపల పులుసు చేయమని అడిగింది. చేయడం ఇష్టంలేని అమ్ము చేయనని చెప్పింది. అలా వీరిద్దరి మధ్య గొడవ పెద్దదయింది. అత్తగారి మాటలకు మనస్తాపం చెందిన అమ్ము…ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు కొడుకులకు విషమిచ్చింది. తర్వాత తాను కూడా విషయం తాగింది. కాసేపటి తర్వాత స్పృహ తప్పి పడున్న వీరిని చూసిన స్థానికులు ముగ్గురిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కమలేష్, యోగేష్ ఇద్దరు మృతిచెందారు. అమ్ము ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పుదుచ్చేరి జిప్మర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయ తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిస్తున్నారు. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *