"మన్మథుడు-2" పోర్చుగల్‌ షెడ్యూల్‌ ఓవర్‌

"మన్మథుడు-2" పోర్చుగల్‌ షెడ్యూల్‌ ఓవర్‌

“మన్మథుడు” సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న మరో ఎంటర్‌టైనర్ “మన్మథుడు-2”. మనం ఎంటర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌ (జెమిని కిరణ్‌) నిర్మిస్తున్న “మన్మథుడు-2” చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ యూరప్‌లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించనున్నాఈ సినిమాలో సీనియర్‌ నటి లక్ష్మీ, హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రావు రమేశ్‌, ‘వెన్నెల’ కిశోర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు.ఇక “RX100” ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక తాజాగా “మన్మథుడు-2” పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఓ నెల రోజుల పాటుగా లిస్బన్‌, పోర్టొ సిటీస్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్‌లో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *