మ‌ణిర‌త్నం క‌ల నెర‌వేరుతుందా?

మ‌ణిర‌త్నం క‌ల నెర‌వేరుతుందా?

వ‌రస ప‌రాజ‌యాలు ఎదుర్కొన్న‌ తమిళ అగ్ర‌ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం గ‌తేడాది వ‌చ్చిన న‌వాబ్‌ తో మళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అదే ఉత్సాహంతో న‌వాబ్‌ తరహాలోనే ఓ భారీ సినిమా రూప‌క‌ల్ప‌నకు సిద్ధ‌మ‌వుతున్నాడు. త‌మిళ ప్ర‌తిష్టాత్మ‌క న‌వ‌ల పొన్నియ‌న్‌సెల్వ‌న్‌ ఆధారంగా ఓ సినిమాను రూపొందించ‌బోతున్నాడట. పీరియాడికల్ వార్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో చియాన్ విక్రం, కార్తీ, జయం రవి, మోహన్ బాబు, అమితాబ్ బచ్చన్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాయ్ నటించబోతున్నారని చెన్నై వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇప్పటికే మొదలైంది. చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్‌ నిర్మిస్తున్నారు. పది, పదకొండవ శతాబ్దాల్లో చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఓ రాజుకు సంబంధించిన కథను ఎన్నుకొని పొన్నియిన్‌ సెల్వమ్‌ చిత్రాన్ని నిర్మించనున్నారు వాస్తవానికి ఈ కథతో సినిమా తీయాలనే ఆలోచన మణిరత్నానికి పదేళ్ల క్రితమే వచ్చిందట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ పట్టాలెక్కబోతుంది. మరి భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *