నవాబ్ మూవీ రివ్యూ

నవాబ్ మూవీ రివ్యూ

దిల్ సే, ఇరువుర్, రోజా ఈ పేర్లు వినగానే ముగ్గురు గుర్తొస్తారు వాళ్లే సంతోష్ శివన్, ఏఆర్ రెహ్మాన్, మణిరత్నం… దాదాపు రెండు దశాబ్దాలుగా క్లాసిక్ మూవీస్ ఇస్తున్న ఈ కాంబినేషన్ మరోసారి ఒక మూవీకి కలిసి నవాబ్ అనే సినిమా వర్క్ చేస్తున్నారు అనే విషయం బయటకి వచ్చినప్పటి నుంచి సినిమాపై భారీ expectations ఏర్పడాయి.. సినిమా హిట్, ఫ్లాప్ అనే విషయాలు పక్కన పెడితే ఈ కాంబినేషన్ ఆన్ స్క్రీన్ తమ మ్యాజిక్ చూపిస్తుందని సినీ లవర్స్ అందరూ అనుకున్నారు… అందుకే తగ్గట్లే అరవింద స్వామి, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, శింబు లాంటి స్టార్ చాష్త్ తో తెరక్కేక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి అందరిని ఆకట్టుకుంది. నవాబ్ మణి కంబ్యాక్ మూవీగా నిలుస్తుందనుకున్నారు.. మరి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మల్టీస్టారర్ ఎలా ఉందో చూడండి.

ఇది నవాబ్ కథ…

అండర్ వరల్డ్ కింగ్ అయిన సేనాపతికి వార్దా, త్యాగు,రుద్రా అనే ముగ్గురు కొడుకులు… ఒకరంటే ఒకరికి అసలు పడని ఈ అన్నతమ్ములు, తండ్రి పవర్ ని సొంతం చేసుకోవాలని, సేనాపతి అధికారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ఇదే అవకాశంగా చేసుకొని తప్పుడు దారిలో నడిచే రసూల్ అనే పోలీస్ ఆఫీసర్ అన్నతమ్ములని విడదీస్తాడు.ఇలాంటి పరిస్థితిలో సేనాపతి మరణించడంతో, తండ్రి అధికారం దక్కించుకోవడానికి ముగ్గురు వారసులు ఏం చేశారు? సేనాపతిని చంపింది ఎవరు? అనేదే నవాబ్ కథ…

nawab review and rating

మణి విషన్ కి ప్రాణం పోశారు

విజయ్ సేతుపతి, అరుణ్, శింబు, అరవింద స్వామి తమ యాక్టింగ్ తో మణి విషన్ కి ప్రాణం పోశారు, ప్రతి ఎమోషన్ ని అద్భుతంగా చూపిస్తూ స్క్రీన్ పై ఎప్పటికి మిగిలిపోయేలా నటించారు.. ఏ ఒక్కరు తగ్గలేదు.. సేనాపతిగా కనిపించిన ప్రకాష్ రాజ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు, ఆయన భార్యగా నటించిన జయసుధ.. భర్త మరణం తెచ్చిన బాధని భరిస్తూనే, అధికారం కోసం కొట్టుకునే కొడుకులు చూసి బాధ పడే తల్లిగా చాలా బాగా నటించారు. మిగిలిన పాత్రల్లో నటించిన జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావ్ హైదరి, ధనయా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

nawab review

సినిమా స్థాయిని పెంచేలా సినిమాటోగ్రఫీ

మణిరత్నం ఊహకి ప్రాణం పోస్తూ రెహ్మన్, సంతోష్ శివన్ అండగా నిలిచారు.. bgm ఏ రేంజులో ఉందొ, అదే రేంజ్ లో సినిమా స్థాయిని పెంచేలా సినిమాటోగ్రఫీ ఉండడం విశేషం. నవాబ్ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి మణి రాసుకున్న బలమైన కథా, కథనాలే కారణం.

nawab review

గాడ్ ఫాదర్ ఛాయలు…

పవర్ అనే పదం చుట్టూ జరిగే ఎన్నో విషయాలని, చీకటి కొనాలని మేకింగ్ మాస్టర్ అయిన మణిరత్నం అద్భుతంగా రాసుకున్నారు. తెరపై తాను అనుకున్న కథని చూపించడానికి సినిమా రూల్స్ అన్నింటిని తిరగరాసాడనే చెప్పాలి… తన రేసీ  స్క్రీన్ ప్లే   నవాబ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ సొసైటీలో ఉన్న మనుషులకి అడ్డం పడుతుంది… అక్కడక్కడా గాడ్ ఫాదర్ ని గుర్తు చేస్తూ సాగిన నవాబ్ సినిమా క్లైమాక్స్ కి వచ్చే సరికి కొంత నెమ్మదించినట్లు అనిపించినా అవేమి కనిపించకుండా… అవకాశం, అధికారం మనుషులని ఏ పరిస్థితికి తీసుకువస్తాయి అనేది తెరపై ముందెన్నడూ చూడని విధంగా చూపించారు.. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది మాస్టర్ క్రాఫ్ట్స్ మ్యాన్ గా చెప్పుకునే మణిరత్నం కంబ్యాక్ మూవీ…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *