సెమీస్‌కు వరణుడి గండం

సెమీస్‌కు వరణుడి గండం

న్యూజీలాండ్‌తో ఇండియా తలపడే సెమీస్‌కు వరణుడి గండం పొంచి ఉంది. మంగళవారం వర్షం పడే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే వరుసగా రెండు రోజులు వర్షం పడితే మాత్రం ఇండియాకే లాభం. అదెలాగ అంటారా… మేం చెప్పడం ఎందుకు మీరే చూసేయండి.

ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మంగళవారం మాంచెస్టర్‌లో జరగనుంది. ఆ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడనున్నాయి. అయితే మాంచెస్టర్‌లో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించవచ్చని బ్రిటన్ వాతావరణ శాఖ చెబుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో తేలికపాటి జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జరిగేది సెమీ ఫైనల్ కనుక దానికి ఎలాగూ బుధవారం రిజర్వ్ డే ఉంది. ఈ క్రమంలో వర్షం కారణంగా ఆటను కొనసాగించలేకపోతే.. బుధవారం రోజున అక్కడి నుంచే ఆటను ప్రారంభిస్తారు. అయితే మంగళవారంకన్నా బుధవారమే ఇంకా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో వరుసగా రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏమిటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఒక వేళ రెండు రోజులూ వర్షం కారణంగా ఆట జరగకపోతే అభిమానులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పనిలేదు. అది టీమిండియాకే లాభం. ఎలాగంటే.. వర్షం వల్ల రెండు రోజులూ ఆట జరగకుండా మ్యాచ్ రద్దయితే.. లీగ్ దశలో అధిక పాయింట్లు సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఈ లెక్కన చూస్తే.. భారత్, న్యూజిలాండ్ జట్లలో భారత్‌కు అధిక పాయింట్లు, అంటే 15 పాయింట్లు ఉన్నాయి కనుక.. టీమిండియానే ఫైనల్‌కు వెళ్తుంది. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ టై అయితే మాత్రం సూపర్ ఓవర్ ద్వారా విన్నర్‌ను నిర్ణయిస్తారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *