దొంగల్ని పట్టించే సీసీ కెమెరానే దొంగలించిన వ్యక్తి ఎలా దొరికాడంటే!

దొంగల్ని పట్టించే సీసీ కెమెరానే దొంగలించిన వ్యక్తి ఎలా దొరికాడంటే!

అతను ఆటో నడుపుతూ జీవనం గడిపే వ్యక్తి. రోజంతా ఆటో నడిపి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కాకపోతే అతనికి నానారకాల చెడు అలవాట్లు వచ్చేశాయి. విపరీతంగా తాగడం, పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకోవడం, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్లడం..ఇలా ఉన్న చెడ్డ పనులన్నీ చేస్తాడు. అయితే…మనోడి ఆటో సంపాదనతో ఇన్ని వ్యవహారాలు చక్కబెట్టాలంటే కుదరదు. ఇవన్నీ చేయాలంటే దొంగతనం అనే పని చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంతకూ అతనేం దొంగతనం చేశాడో..! ఆ తర్వాత ఎలా దొరికిపోయాడో తెలుసుకుందాం!

వనపర్తికి చెందిన 40 ఏళ్ల శాంతానాయక్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో నివశిస్తున్నాడు. ఆటో నడుపుతు సంపాదించే డబ్బు సరిపోక దానికోసం అడ్డదారిలో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. అదే దొంగతనం. అయితే…ఒకరోజు ఆటోలో వెళ్తుంటే రోడ్డుమీద ఓ చోట సీసీ కెమెరా కనబడింది. చేతిలో రూపాయి కూడా లేకపోవడంతో అతని కన్ను సీసీ కెమెరాపై పడింది. సీసీ కెమెరానే దొంగతనం చేస్తే అయిపోతుంది అనుకున్నాడు. ముఖం కనబడకుండా టవల్‌ని చుట్టుకుని, చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆటో పైకెక్కి సీసీ కెమెరా తీగల్ని కట్ చేశాడు. ఎంచక్కా కెమెరాని తీసుకుని జంప్ అయ్యాడు. ఆలస్యం చేస్తే సమస్య అవుతుందని వెంటనే దాన్ని ఇనుప సామాన్లు కొనే షాపులో అమ్మేశాడు.

అతని దురదృష్టమేంటంటే…శ్రీలంకలో ఉగ్రవాదుల దాడుల తర్వాత హైదరాబాద్‌లో పోలీసుల నిఘా ఎక్కువైంది. ఇదే టైంలో సీసీ కెమెరాకు సిగ్నల్స్ రాకపోయే సరికి అక్కడకు వెళ్లి చూశారు. అక్కడి పరిస్థితిని గమనిస్తే…ఎవరో దొంగతనం చేసినట్టు తెలిసింది. ఆలస్యం చేయకుండా దగ్గరలోని మరో సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్‌ని పరిశీలించారు. శాంతనాయక్ చేసిన పని తెలిసిపోయింది. అతని ఆనవాలు తెలియకపోయినా ఆటో నంబర్ దొరకడంతో పోలీసులకు శ్రమ తగ్గింది. వెంటనే శాంతనాయక్ అడ్రస్ కనుక్కుని వెళ్లి అతన్ని అరెస్ట్ ఛేశారు. అసలు సీసీ కెమెరానే దొంగతనం చేయడం పట్ల పోలీసులు నవ్వుకుంటున్నారు. నగరంలో ఇలాంటి దొంగతనం చూడ్డం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *