తల్లి ఎదుటే బిడ్డలను సజీవదహనం చేశారు

తల్లి ఎదుటే బిడ్డలను సజీవదహనం చేశారు

“మాయమైపోతన్నడమ్మా మనిషన్న వాడు… మచ్చుకైనా లేడుచూడూ మానవత్వమున్న వాడు.” అని అందె శ్రీ ఒకపాటలో చెప్తాడు. ఆ కవి అన్నట్లే నానాటికీ మనుషులు మాయమవుతున్నారు. భూతద్దంతో వెతికినా మానవత్వపు ఛాయలు కనిపించడం లేదు. ఏ నగర వీధుల్లో చూసినా, ఏ పల్లె పొత్తిళ్లలో చూసినా… ఈ విశ్వపు అడుగడుగునా… గాయపడ్డ కథలే ఎదురుపడుతున్నాయి. సమస్త మానవజాతీ రోజురోజుకీ మరింత ప్రమాదంలోకి నడుస్తోందని హెచ్చరిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ విషాదసంఘటన మన మొహం మీద వేలుపెట్టి మరీ ప్రశ్నిస్తోంది. 

తల్లి ఎదుటే…

రోజుల వయసున్న కుక్కపిల్లలను, మన ఇంటి చంటి పిల్లల్లానే చూసుకుంటాం. వాటికి చిన్న గాయమైనా విలవిలలాడిపోతాం. ఇక తల్లుల సంగతి వేరేగా చెప్పాలా? అమ్మ ప్రేమ జాతులకు అతీతమైనది. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణీ తన బిడ్డల మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతుంది. కళ్ల ముందు బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతే, ఏ తల్లీ తట్టుకోలేదు. కానీ ఆ సంఘటన ఒక తల్లికి ఎదరైంది. నాలుగు రోజుల వయసున్న నాలుగు కుక్కపిల్లలకు, గుర్త తెలియని దుండగులు తన తల్లి ఎదుటే నిప్పు అంటించారు.

అసహాయ రోదన…

ఆ చిన్నచిన్న కుక్కపిల్లలకు నాలుగు రోజుల వయసుంటుంది. నడవటం కూడా పూర్తిగా రాలేదు. కళ్లు తెరిచి, ఈ ప్రపంచాన్ని చూసీ, ఎన్నో గంటలవ్వలేదు. ఆ బుజ్జి కుక్కపిల్లలపై కొందరు వారి రాక్షసానందం తీర్చుకున్నారు. వాటి తల్లి ఎదుటే… ఈ నాలుగు కుక్కపిల్లలనీ మంటల్లో పడేసి సజీవ దహనం చేశారు. నిప్పుల్లో కాలిపోతున్న పిల్లలను చూసి, ఆ తల్లి ఏమీ చేయలేకపోయింది. ఎవరైనా రాకపోతారా… కాపాడకపోతారా… అని చివరి క్షణం వరకూ, గొంతెండిపోయే వరకూ కేకలేసింది. ఎలాంటి సహాయమూ అందలేదు. తన కళ్ల ఎదుటే… తన చిట్టిచిట్టి పిల్లలు కాలిపోయాయి. ఆ అగంతకులు దీన్ని వీడియో కూడా తీశారు. ఆ వీడియా నిండా మనిషి మాయపోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది.

చివరికి గుర్తించారు…

జరగాల్సిందంతా జరిగాక, స్థానికులు ప్రమాదాన్ని గుర్తించారు. అక్కడకి దగ్గర్లో ఉండే ఒక జంతు ప్రేమికుడికి సమాచారాన్ని అందించారు. ఆ వ్యక్తి ఘటనా స్థలానికి చేరుకునే లోపే మూడు కుక్కపిల్లలు పూర్తిగా కాలిపోయాయి. ఒకటి మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆస్పత్రికి చేర్చిన కాసేపటికే అదీ చనిపోయింది. ఈ దారుణం గురించి “పీపుల్స్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొటెక్టర్‌” పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫోటీజీ అధారంగా వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *