రెండు నిమిషాలు..ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడింది

రెండు నిమిషాలు..ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడింది
ఒక ప్రమాదం. వందలమంది ప్రాణాలు. ముక్కలుముక్కలైన విమానశకలాలు. ఈ దృశ్యాన్ని చూసి ప్రపంచం మొత్తం బాధపడింది. ఒక్కొక్కరిది ఒక్కో గమ్యం. ఒకరు ఆఫీస్ పనిమీద వెళ్తుంటే..మరొకరు బిజినెస్ పనిమీద..ఇంకొకరు కుటుంబంతో కలిసి…ఇలా బయల్దేరిన ఇథియోపియా బోయింగ్ 737-8 విమానం కూలి 157 మంది చనిపోయారు. అయితే…ఈ విమాన ప్రమాదంలో ఆశ్చర్యపోయే ఘటన ఒకటి జరిగింది. ఇంతపెద్ద ప్రమాదంలోంచి ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అది కూడా అతను రెండు నిమాషాలు ఆలస్యం చేసినందుకు అతనికి అతని ప్రాణం దక్కింది. ఆ వివారాలేంటో తెలుసుకుందాం..!
విమానాశ్రయ సిబ్బందితో తగువు!
అతని పేరు ఆంటోని మావ్రోపోలస్. ‘ఇంట్ర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ ‘ అనే స్వచ్ఛందసంస్థకు అద్యక్షుడిగా చేస్తున్నాడు. ఆదివారం రోజున నైరోబిలో జరిగే ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సుకు హాజరుకావాలని అతనికి పిలుపొచ్చింది. ఆ కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. నైరోబికి వెళ్లాలంటే ఇథియోపియ రాజధాని అయినటువంటి అడిస్ అబాబాలో విమానం ఎక్కాలి. అయితే…ఏవో కారణాల వల్ల విమానాశ్రయానికి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే విమానం బయల్దేరి వెళ్ల్పోయింది. అక్కడి విమానాశ్రయ సిబ్బంది అతన్ని లోపలికి అనుమతించలేదు. ఆంటోని వారితో తగువుకి దిగాడు. అయినా సరే అతన్ని పంపకుండా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
man saved from Ethiopia crash by being 2 minutes late
అనుమానం వచ్చి…
అక్కడికి వెళ్లాక ఆంటోనీకి పోలీసులు చెప్పిన విషయం విని గుండె ఆగినంత పనైంది. అతను ఎక్కాల్సిన విమానం అదృశ్యమైందని, అందులో ఎక్కాల్సిన వారిలో ఆంటోనీ ఒకటే మిగిలిపోయాడని చెప్పారు. అందుకే ఆంటోనీపై అనుమానం వచ్చి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి అతని ధృవీకరణ పత్రాలన్నీ పరిశీలించారు. అన్నీ సరైనవే అని నిర్ధారించుకున్నాక పంపించేశారు. అయితే…ఆంటోనీ మాత్రం ఆ సంఘటనలోని బయటికి రాలేకపోయాడు. అంతమందిలో అతనొకడే ప్రాణాలతో బయటపడగలిగాడు.
 ఈ వివరాలన్నీ ఆంటోనీ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి తానెంత అదృష్టవంతున్నో అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే…తనతో ప్రయాణం చేయాల్సిన 157 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *