బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి దారుణ హత్య

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి దారుణ హత్య

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి హత్య,పాత కక్ష్యల కారణంగా ఓ యువకుడిని ఇద్దరు స్నేహితులు దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ ఠాణా పరిధిలో బుధవారం అర్ధరాత్రి రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….అల్ జాబ్రీ కాలనీకి చెందిన మహ్మద్ మూసా(18) అనే యువకుడు షేక్ ఒవేస్ ఆటోపై హెల్పర్ గా పని చేసేవాడు. చార్మినార్-చాంద్రాయణ గుట్ట రూట్ లో తిరిగే ఈ ఆటో ను కాదని కొన్నాళ్ల క్రితం వేరే వ్యక్తి వద్ద హెల్పర్ గా చేరాడు. ఈ సమయంలోనే ఇరువురి నడుమ వివాదం నెలకొంది. కాగా తనను ఇతరులతో కొట్టించాడని ఒవేస్ లోలోపల కోపంతో రగిలిపోయాడు. బుధవారం రాత్రి తన స్నేహితుడైన జాఫర్ అలీతో కలిసి మూసా ఇంటికి వెళ్లి మాట్లాడుదామంటూ అతని తల్లి సమక్షంలోనే తీసుకొచ్చాడు. నేరుగా సుల్తాన్ పూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ముఖంపై బండరాయితో బలంగా మోది దారుణంగా హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే ఎల్.బి.నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, వనస్థలి పురం ఏసీపీ గాంధీ నారాయణ, బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *