నెలరోజులు గుహలో జీవశ్చవంలా బ్రతికాడు..వేటగాళ్లకు దొరకడంతో!!

నెలరోజులు గుహలో జీవశ్చవంలా బ్రతికాడు..వేటగాళ్లకు దొరకడంతో!!

ఒక మనిషి నెలరోజులు తిండి, నీళ్లు లేకుండా బతుకుతాడంటే నమ్మగలరా..! అసాధ్యమనే అంటారు. కానీ..ఓ వ్యక్తి నెలరోజుల పాటు తిండి, నీళ్లే కాదు కనీసం కదలలేని స్థితిలోనే ప్రాణాల కోసం తన్నుకులాడాడు. అసలు విష్యంలోకి వెళ్తే..!

వెన్నెముక విరిగి!
రష్యాకు చెందిన అలెగ్జాండర్ అనేయ్ వ్యక్తి నెలరోజుల క్రితం మంగోలియాలోని తువా అనే అడవిలోకి వెళ్లాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఒక ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో అలెగ్జాండర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముక కూడా విరిగిపోయింది. కదలడానికి లేకపోవడంతో అక్కడే కూలబడిపోయాడు. దాడి ఎలుగుబంటి మాత్రం…తర్వాత వచ్చి తినొచ్చని అలెగ్జాడర్‌పై కొంచెం మట్టి వేసి గుహలోంచి వెళ్లిపోయింది.

వేటకోసం వెళ్లిన వాళ్లు…
ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచి..మట్టితో కప్పినా…ఊపిరి ఆడే స్థితిలో ఉండటంతో అలెగ్జాండర్ తిండి లేకుండా అక్కడే జీవశ్చవంలా నెలరోజులు గడిపాడు. ఈ మధ్యనే కొందరు వేట్గాళ్లు…తమ వెంట వేటకుక్కలతో ఆ ఎలుగుబంటి నివశించే గుహలోకి వెళ్లారు. అక్కడ పడున్న అలెగ్జాండర్‌ను చూసి మొదట..ఎప్పుడో పూడ్చిన మమ్మీ అనుకున్నారు. కొద్దిసేపు పరిశీలించిన తర్వాత ఆ దేహానికి ఊపిరి ఆడుతోందని ధృవీకరించుకుని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స జరిగిన తర్వాత అలెగ్జాండర్ తాను అనుభవించిన ఎలుగుబంటి దాడి గురించి, నెలరోజుల ప్రాణపాయ షితి గురించి వైద్యులకు వివరించి చెప్పాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *