తాగి వాహనం నడపొద్దు..అలాగే! తాగి విల్లు రాయద్దు

తాగి వాహనం నడపొద్దు..అలాగే! తాగి విల్లు రాయద్దు

తాగి వాహనం నడపరాదు…ఇది అందరికీ తెలిసిన మాటే! అయితే…ఈ మాటనే మరో రకంగా చెప్పాల్సి వస్తోంది. తాగి విల్లు రాసివ్వరాదు..అని. ఎందుకంటారా!? అయితే…మీరు లండన్‌లో ఉన్న ఓ ట్యాక్సీ డ్రైవర్‌ని అడగండి. ఆయన పూసగుచ్చినట్టు చక్కగా చెబుతాడు.

లండన్‌కు చెందిన గ్యారీ మెండెజ్ అనే వ్యక్తికి పబ్‌కు వెళ్లి పూటుగా తాగి రావడం అలవాటు. గ్యారీ శారీరకంగా ఎక్కువ బరువు ఉండటం వల్ల అక్కడి ట్యాక్సీ డ్రైవర్లు అతడిని ఎక్కించుకోవడానికి నిరాకరించేవారు. అయితే..డీన్ హ్యూగ్స్ అనే ట్యాక్సీ డ్రైవర్ మాత్రం గ్యారీ ఇబ్బందిని అర్థం చేసుకుని అతడిని పబ్‌కి తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నాడు. రోజూ ఇంత శ్రద్ధగా తీసుకెళ్తున్న డీన్‌కి ఏదైనా చేయాలని భావించిన గ్యారీ…రూ. 1.4 కోట్లు విలువ చేసే ఇంటిని అతడికి రాసిచ్చేశాడు. ఆ తర్వాత గ్యారీ అనారోగ్యం పాలై ఈ మధ్యనే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న డీన్…తనకు రాసిచ్చిన ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఎదురైంది డీన్‌కి…అదే ఇంటిని గ్యారీ పార్ట్‌నర్ రోడిగ్యూజ్ అనే వ్యక్తి తనకూ రాసిచ్చినట్టు కోర్టు గుమ్మం ఎక్కాడు. బాధకరమైన విషయం ఏంటంటే…తాగి ఉండగా రాసిన విల్లు చెల్లదని కొర్టు గ్యారీ ఇంటిని అతని పార్‌నర్ రోడిగ్యూజ్‌కే చెందుతుందని తీర్పు ఇచ్చింది. ఎన్నో ఆశలతో వెళ్లిన డీన్ ఓట్టి చేతులతో వెనక్కి వచ్చాడు. కష్టాలు తీరాయి అని భావించిన డీన్‌కు ఏం చేయాలో తోచక బాధపడ్డాడు. కాబట్టి ఈ సంఘటనతో తేలిన విషయం ఏంటంటే..తాగి వాహనం నడపడమే కాదు…తాగి మాటివ్వడం, తాగి విల్లు రాసివ్వడం కూడా చేయకూడదని!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *