నేడే రాజన్న యాత్ర-అదిరిపోయిన ట్విట్టర్‌ టాక్‌

నేడే రాజన్న యాత్ర-అదిరిపోయిన ట్విట్టర్‌ టాక్‌
ప్రజల్లో నిలిచిపోయే మాస్‌ ఇమేజ్‌ పుష్కలంగా ఉన్న నాయకుల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కచ్ఛితంగా ఉంటాడు. ఒక సినిమాకు కావాల్సిన కథ రాజశేఖర్‌ రెడ్డి జీవితంలో సరిపడినంత ఉంది. మరి ఈ జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తుంటే సాధారణంగానే ఎన్నో ఎదురుచూపులూ, మరెన్నో అంచనాలూ ఉంటాయి. అందులోనూ ఈ పాత్రను మళయాల స్టార్‌ హీరో మమ్ముట్టి పోషిస్తుండటంతో ఆ హైప్‌ ఆకాశానికి చేరుకుంది. దీనికి ఎలక్షన్ల వేడీ తోడైంది. సరిగ్గా సరైన సమయంలో ఈ రోజే “యాత్ర” ప్రేక్షకుల ముందుకొస్తోంది.
YSR Yatra Movie Review

ప్రపంచవ్యాప్తంగా…

యాత్ర సినిమా కాంబినేషన్‌ కూడా ఆసక్తి రేపుతోంది. డైరక్టర్ మహి వి రాఘవ కొత్తవాడైనా… మొదటి సినిమా ఆనందో బ్రహ్మతో ఆడియన్స్‌ను మెప్పించాడు. రెండో ప్రయత్నంగా రాజశేఖర్‌ రెడ్డి జీవితాన్ని ఎంచుకున్నాడు. ఈ ప్రయత్నానికి మళయాల మెగాస్టార్‌ మమ్ముట్టి తోడయ్యాడు. వైఎస్‌ పాదయాత్ర నేపథ్యంలోని ఎమోషనల్‌ కంటెంట్‌ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాటలూ, ట్రలైరూ మంచి మార్కలు కొట్టేశాయి. ప్రంపంచవ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో నేడే విడుదల అవుతోంది. ఓవర్‌సీస్‌లో 180 తెరల మీదా, తెలుగు రాష్ట్రాల్లో 500 తెరల మీదా అలరించనుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లోని కొన్ని తెరల మీద సినిమా పడిపోయింది. దీంతో ట్విట్టర్‌ టాక్‌ వచ్చేసింది. వైఎస్‌ పాత్రలో మమ్ముట్టిని చూస్తుంటే అచ్చంగా రాజశేఖర్‌ రెడ్డి నడిచి వచ్చినట్టే ఉందంటున్నారు. గుండెకు హత్తుకునే ఎమోషనల్‌ సీన్లకు కొదవేలేదనీ, ఇది కచ్ఛితంగా నిలిచిపోయే సినిమా అనీ టాక్‌ నడుస్తోంది. పనిలోపనిగా రాజకీయంగానూ ఉపయోగ పెట్టుకునేందుకు చంద్రబాబు మీద కూడా బాగానే సెటైర్లు పడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *