'మలఫిసెంట్‌: మిస్ట్రెస్‌ ఆఫ్‌ ఈవిల్‌' ట్రైల‌ర్‌

'మలఫిసెంట్‌: మిస్ట్రెస్‌ ఆఫ్‌ ఈవిల్‌' ట్రైల‌ర్‌

హాలీవుడ్ డైరెక్ట‌ర్ జాయ్‌చిమ్‌ రోన్నింగ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలఫిసెంట్‌: మిస్ట్రెస్‌ ఆఫ్‌ ఈవిల్‌’. ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్‌డిస్నీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం మ‌ల‌ఫిసెంట్‌కి సీక్వెల్‌. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అరోరా ఎట్టకేలకు తనకు కాబోయే యువరాజును గుర్తిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మలఫిసెంట్‌కు చెబుతుంది. అయితే, అందుకు మలఫిసెంట్‌ ఒప్పుకోదు. ‘ప్రేమ ఎప్పటికీ సుఖాంతం కాదు’ అని చెబుతుంది. అయినా అరోరా బలవంతం చేయడంతో యువరాజు తల్లిని కలిసేందుకు వెళ్లడంతో అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి.. అప్పుడు మలఫిసెంట్‌ ఏం చేసింది? ఆమెను అంతం చేయడానికి ఏం చేశారు.. మళ్లీ మలఫిసెంట్‌ ఎలా తిరిగొచ్చిందనేని ఈ చిత్ర కథ. అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో వాల్‌డిస్నీ ఈ సినిమాను నిర్మించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం అక్టోబరు 18న విడుదల కానుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *