యాత్ర 2 అంటున్న మహీ వీ రాఘవ్!

యాత్ర 2 అంటున్న మహీ వీ రాఘవ్!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ త్వరలో ‘యాత్ర 2’ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తూ అధికారం దిశగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో జగన్‌ను విష్ చేసిన ఈ డైరెక్టర్… అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఈ మూవీ ప్రకటించారు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత, జగన్ ఓదార్పు యాత్రతో మొదలుపెట్టి, వైఎస్ కుటుంబాన్ని ఇతర రాజకీయ పార్టీలు గురి చేసిన ఇబ్బందులను చూపిస్తూ, అసలుజగన్ పార్టీ పెట్టడానికి దారి తీసిన కారణాలేమిటి? ప్రజల్లో జగన్ పట్ల నమ్మకం పెరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే విషయాలు యాత్ర 2లో చూపించే అవకాశం ఉంది. అయితే ‘యాత్ర 2’ ఎప్పుడు వస్తుందనే విషయాలను మాత్రం మహి వి రాఘవ్ తెలుపలేదు. ‘యాత్రా 2’ స్టోరీ రాయడం ప్రారంభిస్తాను, త్వరలోనే సినిమా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను అనే ప్రకటన మాత్రమే చేశారు. ఈ సీక్వెల్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *