మహేష్ బాబుకు జోడిగా కత్రినా కైఫ్

మహేష్ బాబుకు జోడిగా కత్రినా కైఫ్

భరత్ అనే నేను సినిమాతో సూపర్ డూపర్  హిట్ అందుకున్న మహేష్ బాబు, ప్రజెంట్ వంశీ పైడిపల్లి  డైరెక్షన్‌లో డిఫరెంట్ స్టోరీతో మహర్షి మూవీ చేస్తున్నాడు. ఇందులో మహేష్ ప్రెండ్‌గా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఈ ఇద్దరి మద్య వచ్చే సన్నివేశాలు సినిమా మొత్తంలో హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో వేసిన ఓ విలేస్ సెట్లో షూటింగ్ జరుపుకుంటుంది.పక్క షూటింగ్ జరుపుకుంటునే మరోపక్క ప్రొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటు ఈ  మూవీ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిఫరెంట్ స్టైల్‌లో

మహర్షి  మూవీ తరువాత మహేష్, లెక్కల మాస్టర్ సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ కాంబోలో వచ్చిన సైకాలజికల్ థ్రిలర్ వన్ నేనోక్కడినే ఫ్లాప్ కావడంతో ఈ సారి మహేష్ కోసం డిఫరెంట్ స్టైల్‌లో ఓ కథని రెడీ చేశాడట సుక్కూ. అయితే ఈ సినిమాలో మహేష్‌కు జోడీ  నటించే హీరోయిన్‌ గురించి ఓ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కోడుతుంది. మహేష్ సరసన ఓ బాలీవుడ్ బ్యూటీ నటించబోతుందని టాక్ వినిపిస్తోంది.

రీ ఎంట్రీ

కథకు డిమాండ్ మేరకు ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కత్రినా కైఫ్ అయితే బాగుటుందని భావించాడట సుకుమార్. ఇటివలే ఆమెను కలిసి స్టోరీలోని ఆమె పాత్రకు సంబంధించిన లైన్ వినిపించాడట. కథలో హీరోయిన్  క్యారెక్టరైజైషన్‌ నచ్చడంతో పాటు, చాలా రోజుల నుంచి తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడాని ప్రయత్నాలు చేస్తుంది కత్రినా. అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని  వెంటనే ఓకే చెప్పిందట టాక్. ఇంతకుముందు తెలుగులో రెండు సినిమాలు చేసిన కత్రినా ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరి సినిమా సెట్స్ మీదకు వెళ్లే లోపు  కత్రినా కైఫ్ ఉంటుందో లేదా మరో హీరోయిన్‌ని  తీసుకుంటారో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *