సుకుమార్ తో సినిమా చేయట్లేదు: మహేశ్ బాబు

సుకుమార్ తో సినిమా చేయట్లేదు: మహేశ్ బాబు

మహేశ్ బాబు హీరోగా మైత్రి మూవీస్ బ్యానర్‌లో సుకుమార్ తర్వాతి సినిమా ఉంటుందని గత ఏడాది అక్టోబర్లో అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అప్పుడే నిర్మాతలు అన్నారు. కానీ హఠాత్తుగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా తెరమీదకు వచ్చింది. దాంతో అందరికీ ఏం జరిగింది అనే సందేహాలు కలిగాయి. వీరిద్దరి మధ్యా విభేధాలు వచ్చాయని బయిట అని వార్తలు వస్తున్నాయి. అవి రూమర్స్ గా నెక్ట్స్ లెవిల్స్ కు వెళ్లకుండా ఆపాలనే మహేష్ డెసిషన్ తీసుకున్నారు. వీటిని ఆపటానికి మహేష్ ట్వీట్ చేసారు.

క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్‌తో సినిమా చేయడం లేదని చెప్పాడు. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సుక్కూకి ప్రిన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సందర్భంగా సుకుమార్‌పై సూపర్ స్టార్ ప్రశంసలు గుప్పించాడు. సుకుమార్ అంటే నాకెంతో గౌరవమన్న ప్రిన్స్.. 1 నేనొక్కడినే సినిమా ఓ క్లాసిక్‌గా మిగిలిపోతుందన్నాడు. ఆ సినిమా కోసం పని చేసిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశాడు.

ప్రాజెక్టు ఆగటానికి కారణం

మహేష్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి సినిమా మరికొద్ది రోజుల్లో పూర్తి అవుతోంది. ఈ సినిమా తరువాత మహేష్ 26 సినిమా రంగస్థలం దర్శకుడు సుకుమార్ తో ప్రారంభం కావాలి. ఈ మేరకు కథలు వినిపించారు సుకుమార్. అయితే,ఈ లోగా ఎఫ్ 2 తో హిట్ కొట్టి అనీల్ రావిపూడి సీన్ లోకి వచ్చేసారు. దాంతో మహేష్ ఇటు షిప్ట్ అవటంతో..అటు అల్లు అర్జున్ వద్దకు సుకుమార్ షిప్ట్ అయ్యారు.

ఇటు చూస్తే సుకుమార్ స్క్రిప్ట్ వర్క్స్ ఇంకా పూర్తికాకపోవడంతో.. మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. స్క్రిప్ట్ వర్క్స్ పూర్తికావడానికి మరింత సమయం పడుతుందని మహేష్ తో చెప్పడంతో.. ఎంత సమయం అయినా ఫర్వాలేదు స్క్రిప్ట్ బాగుండాలని సుకుమార్ తో చెప్పినట్టు సమాచారం.

మహర్షి పూర్తయిన వెంటనే.. అనిల్ రావిపూడితో సినిమా స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా ఆ సినిమా కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మహేష్. డైరక్టర్ కోసం తన డేట్స్ ని వృధా చేసుకుంటూ ఖాలీగా కూర్చోవటం ఇష్టం లేకే ఈ డెసిషన్ తీసుకున్నారని సమాచారం. అనీల్ రావిపూడి తో సినిమా చేసి వచ్చేసరికి సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంటుంది కాబట్టి మహేష్ 27 సుకుమార్ తో చెయ్యొచ్చేమో.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *