మేడమ్‌ టుస్సాడ్స్‌ వ్యాక్స్‌లో ఇండియన్ సెలబ్రిటీల మైనపు బొమ్మలు

మేడమ్‌ టుస్సాడ్స్‌ వ్యాక్స్‌లో ఇండియన్  సెలబ్రిటీల మైనపు బొమ్మలు

మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ నటుల్లో బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ మైనపు బొమ్మ ఫస్ట్ ప్రతిమగా రికార్డుకెక్కింది.బిగ్ బి ఫ్యాన్స్ కోసం కొన్నేళ్ల క్రితం డిల్లీలో ఉన్న మేడమ్‌ టుస్సాడ్స్‌ బ్రాంచ్‌లో మరో మైనపు విగ్రహాన్ని రూపొందించారు.బాహుబలి సిరీస్‌తో యంగ్‌ రెబెల్‌స్టార్ ప్రభాస్‌ క్రేజ్ ఇంటర్ నేషనల్ స్థాయిలో పెరిగిపోయింది.ఈ మూవీ ద్వారనే సింగపూర్‌లో ఉన్న మేడమ్‌ టుస్సాడ్స్‌ సిబ్బంది మైనపు విగ్రహం రూపొందించేందుకు ప్రభాస్‌ను కలిశారు.అయితే మిగత సెలబ్రిటీల బొమ్మల కంటే కూడా ప్రభాస్‌ మైనపు విగ్రహానికి ఓ స్సెషలిటి ఉంది..బాహుబలి మూవీలో ప్రభాస్ ఆయుధం పట్టుకున్న స్టిల్‌తోనే విగ్రహం రూపొందించారు. ఇండియలో క్యారెక్టర్‌ బేస్డ్‌ మైనపు విగ్రహాల్లో ప్రభాస్‌దే కావడం విశేషం.

టాలీవుడ్‌లో ఎక్కువ క్రేజ్‌ ఉన్న మరో హీరో మహేష్ బాబు.భరత్ అనే నేను లాంటి సోషల్ కంటెంట్ ఉన్న కథలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్‌ క్రేజ్ మరింతగా పెరిగింది.ఈ మూవీ హిట్ తరువాత సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ సిబ్బంది విగ్రహం మహేశ్‌ కొలతలు తీసుకొని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని రూపొందించారు.ఈ నెల 25న ఏఎంబీ సినిమాస్‌లో మహేష్ మైనపు బొమ్మని ప్రదర్శించారు.ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఏ సెల్రబిటీ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించలేదు.ఆ అవకాశం దక్కించుకున్న ఏకైక సెలబ్రిటీ సూపర్ స్టార్ మహేష్.

మాజీ మిస్‌ వరల్డ్‌,బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ మైనపు బొమ్మకు లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో చోటుదక్కింది.2004లోన ఐష్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.బాలీవుడ్‌ గ్రీక్‌వీరుడు హృతిక్‌ రోషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.ధూమ్‌ 2 సినిమాతో హృతిక్‌ పేరు మార్మోగిపోయింది.ఈ సినిమాలో దిల్‌ లగా..అనే పాటలో హృతిక్‌ వేసుకున్న దుస్తులతో మైనపు విగ్రహాన్ని లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో రూపొందించారు..అయితే టుస్సాడ్స్‌ చరిత్రలోనే ఎక్కువ మంది ముద్దాడిన ఏకైక మైనపు విగ్రహం హృతిక్‌ రోషన్‌దే.

తన ప్రతిమని తమే చూసుకొవడం ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నారు సెలబ్రిటీలు.అయితే కొంతమంది మాత్రం తన విగ్రహల విషయంలోఅసంతృప్తి ఉంటే,మరికొంతమంది తమ విగ్రహం చూసి తెగ సంబర పడిపోతున్నారు. ఇక ఒక సెలబ్రిటీకి సంబంధించి రెండు విగ్రహలు కూడా ఉండడం విశేషం.

బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌కు రావణ్ మూవీ తరువాత మేడమ్‌ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు.ఈ సినిమాలోని ఛమ్మక్‌ ఛల్లో సాంగ్‌లోలో కరీనా వేసుకున్న ఎరుపు రంగు చీరకట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. అయితే కరీనా విగ్రహంలోని ముఖకవళికలు బాగాలేవని అప్పట్లో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక బార్బీ డాల్‌ కత్రినా కైఫ్‌ మైనపు విగ్రహం న్యూయార్క్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉంది.ఒకప్పటి అడల్ట్‌ సినిమాల బ్యూటీ సన్నీలియోన్ బాలీవుడ్‌లో అడుగు పెట్టిన తరువాత తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది.పోర్న్ సినిమాల నుంచి వచ్చిన సన్నీ ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని బాలీవుడ్‌లో నటిగా నిరూపించుకోసం చాలా కష్టపడింది.ఈ నేపథ్యంలో టుస్సాడ్స్‌ సిబ్బంది ఆమె మైనపు విగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించిన టుస్సాడ్స్‌ సిబ్బంది సన్నీ లియోన్ మైనపు విగ్రహం డిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఎర్పాటు చేశారు..

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ మైనపు విగ్రహాన్ని లండన్‌లో ఎర్పాటు చేశారు టుస్సాడ్స్‌ వ్యాక్స్‌ సిబ్బంది.తన సిక్స్‌ప్యాక్‌ శరీరాకృతితో,నటనతో ఎందరో హృదయాలను దోచుకున్న సల్మాన్‌ మైనపు విగ్రహాన్ని డిల్లీలోనూ రూపొందించారు.ఇక కింగ్‌ ఖాన్‌ షారుక్‌ మైనపు విగ్రహం కూడా లండన్‌ మ్యూజియంలో ఉంది.అయితే షారుక్‌ కోసం రెండు మూడు మైనపు విగ్రహాలను రూపొందించింది వ్యాక్స్‌ మ్యూజియం.ఈ హీరో నటించిన ఫ్యాన్ మూవీలోని ఓ స్టిల్‌ను కూడా మైనపు విగ్రహంలా మలిచారు.ఇటీవలే దీపిక పదుకొణె మైనపు విగ్రహాన్ని లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆవిష్కరించారు.త్వరలో డిల్లీలోనూ మరో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

బాహుబలి పాత్రలో నటించిన ప్రభాస్‌కు ఎంతటి ఆదరణ లభించిందో..కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్‌కు కూడా అంతే పాపులారిటీ దక్కింది.అందుకే కట్టప్ప గెటప్‌లో ఉన్న మైనపు విగ్రహాన్ని లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో త్వరలో ఆవిష్కరించబోతున్నారు…బాలీవుడ్‌ క్యూట్ బ్యూటీ అనుష్క శర్మ మైనపు విగ్రహం సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఎర్పాటు చేశారు.అయితే దీనిని సాధారణ విగ్రహంలా కాకుండా ఇంటరాక్టివ్‌ బొమ్మలా రూపొందించారు.బొమ్మ పక్కన నిలబడి మనం ఏదన్నా మట్లాడితే..అందుకు ఆ విగ్రహం కూడా స్పందించేలా డిజైన్‌ చేశారు.మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మాట్లాడే ఏకైక మైనపు బొమ్మ అనుష్కదే కావడం విశేషం.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *