మహేష్ మరోసారి ఖాకి వేస్తాడా?

మహేష్ మరోసారి ఖాకి వేస్తాడా?

మహేశ్ బాబు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ గా చెప్పుకునే పోకిరి, దూకుడు సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించి మెప్పించాడు. మహేశ్ ఖాకి వేస్తే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం కలిగించిన ఈ రెండు చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు… మరోసారి ఖాకి వేస్తూ ఆగడు సినిమాలో కనిపించాడు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే మహేశ్ ఎప్పటికీ మర్చిపోలేనంత దారుణమైన సినిమాగా మిగిలిపోయింది.ఇక మహేశ్ ఇప్పటిలో పోలీస్ పాత్రలో కనిపించడేమో అనుకుంటున్న సమయంలో, అనిల్ రావిపూడి మరోసారి మహేశ్ కి ఖాకి చొక్కా వేయిస్తున్నాడని… అనిల్ తాలూకూ ఫన్ ఉంటూనే పవర్ఫుల్ గా ఉండే పాత్రలో మహేశ్ కనిపించబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. అది విన్న వాళ్లు ఆగడు సినిమాకి అనిల్ రావిపూడి వర్క్ చేశాడు, అది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు అనిల్ దర్శకత్వంలో మళ్లీ పోలీస్ కథ అంటే అది మరో ఆగడు అయ్యే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అది నిజం కాదని అనిల్, మహేశ్ ని పోలీస్ గా చూపించట్లేదని, చాలా ఎంతెర్తైనింగ్ కథతో సినిమా చేయబోతున్నాడని దిల్ రాజు టీం నుంచి టాక్ వినిపిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *