లీకైన మహేష్‌ కొత్త లుక్‌ !

లీకైన మహేష్‌ కొత్త లుక్‌ !

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షితో సాలీడ్ సక్సెస్ అందుకున్నాడు.. ఈ మూవీ హిట్‌తో మంచి జోష్‌ మీదున్న మహేష్ హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం కాశ్మీర్‌లో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇక్కడ ఆర్మీకి సంబంధించిన సీన్స్ చిత్రికరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మ‌హేశ్ లుక్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా మ‌హేశ్ లుక్ లీకైంది. ఆర్మీ బ‌ట్ట‌ల్లో మ‌హేశ్, రాజేంద్ర ప్ర‌సాద్ ఉన్న ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీ కథపరంగా కాశ్మీర్ నుంచి ఆంధ్రాకు రైలు ప్రయాణం చేసే మహేష్, ఆ జ‌ర్నీలోనే రష్మికతో ప్రేమలో పడతాడట. ఈ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు చాలా స‌ర‌దాగా ఉంటాయ‌ని తెలుస్తోంది. చిత్రానికే హైలైట్‌గా నిల‌వ‌నున్న‌ ఈ ట్రైన్ ఎపిసోడ్ రన్ టైమ్ ఎక్కువగానే ఉంటుందంట. అంతేకాదు ఈ సన్నివేశాలను ఒరిజిన‌ల్ ట్రైన్‌లో చిత్రీకరించడం కష్టం కాబట్టి, అన్నపూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో ఓ స్పెష‌ల్‌ ట్రైన్ సెట్‌ను తీర్చిదిద్ది అక్కడే ఈ ఎపిసోడ్స్‌ను షూట్‌ చేయాలని భావిస్తోన్నారు చిత్రటీమ్. కాశ్మీర్‌లో జ‌రిగే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వచ్చే నెలలో ఈ ట్రైన్ ఎపిసోడ్‌ని పిక్చ‌రైజ్ చేస్తార‌ట‌. మరి ఈ లెంగ్తీ ట్రైన్ ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటందో తెలియాలంటే 2020 సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *