‘మహర్షి’ రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్ర యూనిట్

‘మహర్షి’ రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్ర యూనిట్

మహేష్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మార్చి 15నాటికి రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌వుతుంది. మ‌రో వైపు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 25న విడుద‌ల చేస్తున్నారు.

Maharshi release date

అధికారిక సమాచారం వెలువడటంతో మహర్షి కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. కొన్ని రోజులుగా మహర్షి జూన్‌కి వాయిదా పడట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో యూనిట్ ప్రకటన ద్వారా రూమర్స్‌కు చెక్ పెట్టింది. మహేష్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తోన్న ఈ ‘మహర్షి’ చిత్రం హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *