మళ్లీ వాయిదా పడిన మహర్షి

మళ్లీ వాయిదా పడిన మహర్షి

భరత్ అనే నేను సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన సూపర్ మహేష్ ప్రస్తుతం మహర్షి మూవీతో బిజీగా ఉన్నాడు. ఇందులో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటింస్తుడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిన్నట్టు తెలుస్తోంది. అయితే రిలీజ్ విషయంలో మేకర్స్ తర్జన భర్జన పడుతున్నారు. మొదట ఏప్రిల్ 5 న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన చిత్రటీమ్ అనుకోని కారణాల వల్ల షూటింగ్ డిలే కావడంతో ఆ విడుదల డేట్‌ని ఏప్రిల్25 న రిలీజ్ చేయబోతున్నమని నిర్మాత దిల్‌రాజు ప్రెస్‌మీట్ పెట్టిమరి చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ డేట్‌ కూడా రిలీజ్ కావడం లేదనే టాక్ టాలీవుడ్ సర్కీల్‌లో వినిపిస్తోంది.

Maharshi release date postponed

కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా

సినిమా షూటింగ్ ఏప్రిల్ 16 వరకు కంప్లీట్ కాదని తెలుస్తోంది.. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేందుకు.. ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు అంత తక్కువ టైం సరిపోదని భావిస్తున్నారట మేకర్స్ . దీంతో మే 9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఏప్రిల్ లో హిట్ సెంటిమెంట్ అని భావిస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు ఇది కాస్త నిరాశకలిగించే విషయమే. కానీ సమ్మర్ సీజన్ ను మిస్ చేసుకోకుండా ఉండడం మంచిదే. ఎందుకంటే మహేష్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ అన్నీ సమ్మర్ లో రిలీజ్ అయినవే. కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉందనే బజ్ విన్పిస్తోంది కాబట్టి మరో సారి మహేష్ బాక్సాఫీస్‌ని ఊపేయడం ఖాయం అంటున్నారు. మరి మహర్షి అందరి అంచనాలను ఎంతవరకు నిలబెడుతాడో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *