మహేష్‌ బాబు ఏఎంబీ సినిమాస్‌లో ప్రత్యేకతలు ఇవే...

మహేష్‌ బాబు ఏఎంబీ సినిమాస్‌లో ప్రత్యేకతలు ఇవే...

అటు తెర మీదా, ఇటు ప్రకటనల్లోనూ తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న మహేష్ ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టాడు. ఏసియన్ సినిమాస్‌తో జతకట్టి, ఏంఎంబీ సినిమాస్‌ పేరుతో మల్లీప్లెక్స్‌ను నిర్మించేశాడు. దీన్ని సూపర్ స్టార్‌ కృష్ణ ప్రారంభించారు. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ ఎలా ఉందా అన్న చర్చ… ఇండస్ట్రీలోనూ, సినీ అభిమానుల్లోనూ బాగానే నడుస్తోంది. ఇంతకీ అదెలా ఉందో మనమూ తెలుసుకుందాం పదండి.

Mahesh babu AMB Cinimas

మొదలైంది…

ఎప్పటినుంచో ఊరిస్తున్న మహేష్‌బాబు ఏఎంబీ సినిమాస్ మొదలైంది. ఈ మల్లీప్లక్స్‌ను సూపర్ స్టార్ కృష్ణ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేష్‌బాబు, నమ్రత, కొరటలా శివతో పాటు పలువురు సినీ ప్రముఖులూ, కుటుంబ సభ్యులూ పాల్గొన్నారు. కొండాపూర్‌లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్ పక్కనే అన్నీ రకాల అధునాతన హంగులతో ఈ ఆదివారం సాయంత్రం 6.15 గంటల నుంచి ఇక్కడి స్క్రీన్లు అలరించనున్నాయి.

Mahesh babu AMB Cinimas

అంతర్జాతీయ స్థాయిలో…

ఏఎంబీ సినిమాస్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. దీనికోసం తీసుకున్న శ్రద్ధ అడుగడుగునా కపబడుతోంది. ఇందులో మొత్తం కలిపి ఏడు థియేటర్లున్నాయి. ప్రేక్షకులకు లగ్జరీని అందించేందుకూ, సరికొత్త అనుభూతినిచ్చేందుకూ చాలానే ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాస్‌లోని అత్యద్భుతమైన ఇంటీరియర్ స్పెషల్‌గా ఆకట్టుకుంటోంది. పార్టీ జోన్‌, స్పెషల్ కిడ్స్ జోన్ అలరించే విధంగా ఉన్నాయి. ఇంతవరకూ ఎక్కడా లేనంత సౌకర్యంగా లగ్జరీ సీటింగ్‌ విధానం ఉందని చెప్తున్నారు. ప్రత్యేకంగా వి.ఐ.పి లాంజ్‌నూ ఏర్పాటు చేశారు. మొత్తం కలిపి దీన్లో 1638 సీట్లున్నాయి. టిక్కెట్టు ధర రెండొందల రూపాయల నుంచీ ప్రారంభమవుతంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *