మహర్షి కలెక్షన్స్ కోసం మాస్టర్ ప్లాన్

మహర్షి కలెక్షన్స్ కోసం మాస్టర్ ప్లాన్

మహర్షితో కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ రాబట్టిన మహేశ్, ఇప్పుడు కలెక్షన్స్ మరింత పెంచడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు కానీ అది ఎంత మాత్రం సక్సస్ అవుతుందనే డౌట్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మరి మహర్షి కోసం మహేశ్ అండ్ టీం వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటో చూడండి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో బెంచ్ మార్క్ మూవీగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ‘మహర్షి’. మొదటి రోజు నుంచే పాజిటివ్ అండ్ డివైడ్ టాక్ రెండూ తెచ్చుకుంటున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ రాబట్టి మహేశ్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. అయితే నెమ్మదిగా మహర్షి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తూ ఉండడంతో మహేశ్ అండ్ కో… కొన్ని సీన్స్ ని యాడ్ చేసి తగ్గుతున్న కలెక్షన్స్ జోరుని మళ్లీ పెంచాలని ఆలోచిస్తున్నారట.

మహర్షికి మొదటి నుంచి వినిపిస్తున్న నెగటివ్ కామెంట్స్ లో సినిమా లెంగ్త్ ఎక్కువ అయిందనే కామెంట్ కూడా ఉంది. ఇప్పుడున్న 2గంటల 50నిమిషాల డ్యూరేషన్ నుంచి కాస్త ట్రిమ్ చేసి రెండున్నర గంటకి కట్ చేస్తే సినిమా ఇంకా బాగుంటుందని కొందరు సినీ అభిమానులు భావిస్తుంటే… ఇందుకు భిన్నంగా మహర్షి దర్శక నిర్మాతలు మాత్రం డ్యూరేషన్ పెరిగినా పర్లేదని కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నారట. తగ్గుతున్న కలెక్షన్స్ ని కాపాడుకోవడానికే చిత్ర యూనిట్ ఇలా చేస్తుండొచ్చు కానీ కొత్త సీన్స్ కారణంగా సినిమాకి నష్టం జరిగే ప్రమాదమే ఉంది కానీ పెద్దగా ఉపయోగ పడేదేమి ఉండదనేది నిజం.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *