ముప్పై ఏళ్లుగా ఉన్న డ్రైవర్‌ని హత్య చేసిన డాక్టర్

ముప్పై ఏళ్లుగా ఉన్న డ్రైవర్‌ని హత్య చేసిన డాక్టర్

ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన డాక్టర్లే ప్రాణాలను తీయడానికి పూనుకుంటే…అదికూడా చిన్న కోపానికే ప్రాణాలు తీసేంత దారుణమైన నిర్ణయం తీసుకుంటే…ఇటువంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌నే హత్య చేసి..ఆనవాళ్లు లేకుండా చేయడానికి యాసిడ్‌లో ఉంచిన ఘటన ఇపుడు సంచలనంగా మారింది.

లేనిపోని  అనుమానాలతో…

భూపాల్‌లో ఆర్థోపెడిక్ డాక్టర్ అయిన సునీల్…30 ఏళ్లుగా తనకు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరేంద్రను తన ఇంట్లోనే హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా అతని మృతదేహాన్ని 12 ముక్కలు చేసి, వాటిని యాసిడ్‌లో భధ్రంగా దాచిపెట్టాడు. ఒక డాక్టర్ ఇలా ఎందుకు చేశాడు అని ప్రశ్నిస్తే…డ్రైవర్ భార్యకు, తనకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు అందుకే హత్య చేశానని చెప్పడం గమనార్హం.

Doctor kills driver over affair

డాక్టర్ సునీల్ భార్య..ఇంట్లోనే ఉంటూ బొటిక్ నిర్వహించేది. కొన్నాళ్ల క్రితం ఆమె చనిపోయింది. దీంతో బొటిక్ నిర్వహణ కొనసాగడానికని డ్రైవర్ భార్యకు ఇచ్చాడు. ఈ వ్యవహారమంతా చూసి డ్రైవర్ వీరేంద్రకు అనుమానం కలిగింది. వివాహేతర సంబంధం ఉంది కాబట్టే బొటిక్ తనకు ఇచ్చాడనీ అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం బలంగా పెరిగి…భార్యను సూటిపోటీ మాటలతో వేధించేవాడు. డాక్టర్‌తో మాట్లాడినా…ఎందుకు మాట్లాడావు, ఎందుకు నవ్వావు అంటూ పిచ్చిగా ప్రవర్తించేవాడు. ఈ ఒత్తిడిని భరించలేక వీరేంద్ర భార్య ఈ విషయాల్ని డాక్టర్ సునీల్‌తో చెప్పుకుని బాధపడింది.

చికిత్స అని చెప్పి…

అయితే…డ్రైవర్‌కు వాస్తవాల్ని వివరించి మంచి ఆలోచన పెంపొందించాల్సి డాక్టర్ అతన్ని చంపాలని నిశ్చయించుకున్నాడు. హత్య చేస్తే దొరికిపోతాననే భయంతో కృరమైన నిర్ణయం తీసుకున్నాడు. పథకం ప్రకారం ఒక డ్రమ్ము నిండుగా యాసిడ్‌ని తెప్పించి ఇంట్లోనే దాచిపెట్టాడు. పదునైన చెక్కలను కోసే రెండు రంపాలను కూడా తెచ్చుకున్నాడు. ఈ వ్యవహారమంతా డ్రైవర్ వీరేంద్రకు, అతని భార్యకు తెలియకుండా చేశాడు. ఇదే క్రమంలో పంటినొప్పి ఉందని డ్రైవర్ చెప్పడంతో…చెక్అప్ చేస్తానని చెప్పి వీరేంద్రను బెడ్‌పై పడుకోబెట్టాడు డాక్టర్ సునీల్. ఆ సమయంలో బొటిక్ తెరిచి ఉంచలేదు. ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్‌కు ఉపయోగించే కత్తిని వాడి వీరేంద్ర గొంతు కోసేశాడు. మెదడుకి రక్తాన్ని సరఫరా చేసే కీలకమైన నరాలు తెగి.. వీరేంద్ర గింజుకుని చనిపోయాడు. ఇక డాక్టర్ సునీల్ పథకం ప్రకారం వీరేంద్ర మృతదేహాన్ని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి తీసుకెళ్లాడు.

సులభంగా దొరికిపోయాడు

మొదటి ఫ్లోర్‌లో మృతదేహాన్ని రంపాలను ఉపయోగించి 12 ముక్కలు చేశాడు. వాటన్నిటినీ యాసిడ్ ఉంచిన డ్రమ్ములో పెట్టి మూత వేశాడు. అయితే…అతన్ని చంపి అప్పటికే గంటపైగా కావడం…గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకూ రక్తపు మరకలు ఏర్పడటం వల్ల ఆ వాసన చుట్టుపక్కల ఉన్న వారికి వచ్చింది. ఆ వాసనకు డాక్టర్‌పై అనుమానం వచ్చింది. పైగా డాక్టర్ కంగారు పడటం, రక్తపు మరకలు ఉండటంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు డాక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. భర్తను హత్య చేయడంతో డ్రైవర్ వీరేంద్ర భార్య కన్నీళ్ల పర్యంతమైంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *