మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్... హాంఫట్

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్... హాంఫట్

చాలా కాలం నుంచి తన స్థాయి సినిమా లేక ఇబ్బంది పడుతున్న మణిరత్నం ఈసారి మరో క్రేజీ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడు. పీరియాడికల్ వార్ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాలో సౌత్, నార్త్ నుంచి స్టార్ హీరోలు హీరోయిన్స్. నటించబోతున్నారని సమాచారం.. అయితే ఈ సినిమా బడ్జెట్‌ని చూసి నిర్మాతలు భయపడుతున్నారట. మరి ఈ సినిమా కోసం మణిరత్నం ఎంత బడ్జెట్ అనుకుంటున్నాడో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ..

వ‌రస ప‌రాజ‌యాలు ఎదుర్కొన్న‌ తమిళ అగ్ర‌ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం గ‌తేడాది వ‌చ్చిన న‌వాబ్‌ తో మళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అదే ఉత్సాహంతో న‌వాబ్‌ తరహాలోనే ఓ భారీ సినిమా రూప‌క‌ల్ప‌నకు సిద్ధ‌మ‌వుతున్నాడు. త‌మిళ ప్ర‌తిష్టాత్మ‌క న‌వ‌ల పొన్నియ‌న్‌సెల్వ‌న్‌ ఆధారంగా ఓ సినిమాను రూపొందించ‌బోతున్నాడట. పీరియాడికల్ వార్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో చియాన్ విక్రం, కార్తీ, జయం రవి, మోహన్ బాబు, అమితాబ్ బచ్చన్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాయ్ నటించబోతున్నారని చెన్నై వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది. అయితే బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాని నిర్మించేందుకు నిర్మాతలు భయపడుతున్నారని సమాచారం.

అయితే ఈ సినిమాని మొదట మణిరత్నం నిర్మించాలని భావించాడు. కథ పరంగా బ‌డ్జెట్ ఎక్కువ అవ‌స‌ర‌మ‌వ‌డంతో వెన‌క్కి త‌గ్గాడట. త‌మిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో ఈ సినిమా విష‌యమై మ‌ణిర‌త్నం చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు స‌మాచారం. అయితే నిర్మాణానికి ఆ సంస్థ ముందుకు రాలేద‌ని తెలుస్తోంది. దీంతో రిల‌యెన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. మణిరత్నం ఆ ప్రాజెక్ట్ ను ఏ ముహూర్తాన అనుకున్నాడో కాని అప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి సినిమాకు వస్తూనే ఉంది. మ‌రి రిల‌యెన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ అయినా ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వ‌స్తే మ‌ణిర‌త్నం క‌ల నెర‌వేరిన‌ట్టే. లేదంటే ఈ మేకింగ్ మాస్టర్ కల కలలాగే మిగిలిపోతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *