పెద్దలమీద నమ్మకం లేక...ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు!

పెద్దలమీద నమ్మకం లేక...ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు!

ప్రేమ ఎలా కలుగుతుందో…ఎపుడు కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ తెలిసితెలియని వయసులో ఆకర్షణ వల్ల కలిగే ప్రేమల విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నిండుప్రాణాలను పోగొట్టుకుని పిల్లలను దూరం చేసుకోవాల్సివస్తుంది. ఇలా తెలిసి తెలియని వయసులో ఆవేశంతో అనాలోచితంగా తీసుకుని ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

పెద్దలు ఒప్పుకున్నా కూడా…

తమిళనాడు…కోయంబత్తూరు జిల్లా నెగమమ్ దగ్గరలో కాట్టమ్‌పట్టిలో ఒక కోళ్ల ఫామ్‌లో మిదింగనర్సరి(19), ప్రేమ(18) ఇద్దరూ పనిచేస్తున్నారు. వీరు పరిచయమైన కొంత కాలానికి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఇదే విషయం వారి పెద్దలకు కూడా చెప్పారు. ఇంటికి రండి పెళ్లి చేస్తాం అని పెద్దలు కూడా సానుకూలంగా అన్నారు. అయితే సహజంగా పెద్దలు ప్రేమ పెళ్లికి ఒప్పుకోరు అనే భయంతో ఇద్దరూ పని చేసే కోళ్ల ఫామ్‌లోనే ఉండే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

పెద్దలు ఒప్పుకోలేదని వారికి వారే ఆలోచించుకుని…ఇంటికి వెళ్లలేక, ఇద్దరు ఒంటరిగా వెళ్లి పెళ్లిచేసుకోలేక మనస్థాపానికి గురయ్యారు ఇద్దరు. దీంతో ఏం చేయాలో తెలీక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసి పెద్దలు ఆవేదనతో కుప్పకూలిపోయారు. పెళ్లికి ఒప్పుకున్నాం, ఇంటికి వస్తే పెళ్లి చేద్దామని అనుకున్నామని దు:ఖించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *