అరుదైన అవకాశం దక్కించుకున్న ఏడుగురు నేత‌లు!

అరుదైన అవకాశం దక్కించుకున్న ఏడుగురు నేత‌లు!

ఎక్క‌డైతే పొగోట్టుకున్నామో అక్క‌డే వెతుక్కోవాలంటారు మ‌న పెద్ద‌లు…స‌రిగ్గా అదే ఫార్ములాను ఫాలో అయ్యారు ఆ ఏడుగురు నేత‌లు… దీంతో ఆ ఏడుగురి లీడ‌ర్ల‌ను అదృష్టం వ‌రించింది.. గ‌తంలో గ‌ల్లీలోనే ఉందామ‌ని భావించిన ఆ నేతలు ఊహించ‌ని విధంగా ఈ సారి ఏకంగా ఢిల్లీ బాటే ప‌ట్టారు.. ఇంత‌కీ ఎవ‌రా ఆ ఏడుగురు నేత‌లు..? ఎంటి ఆ క‌థ లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…

గత అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఏడుగురు అభ్యర్థులు జాక్ పాట్ కోట్టేసారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన కొద్ది కాలంలోనే ఎంపిలుగా ఎన్నిక‌య్యారు.. పోయిన‌చోటే సంపాదించాల‌న్న కాన్సెప్ట్ తో ఎంపి అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగిన ఏడుగురు నేత‌లు పార్ల‌మెంట్ లో అడుగు పెట్ట‌బోతున్నారు. కోడంగ‌ల్ నుంచి ఎమ్మెల్యేగా గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓడిపోయారు. అయితే పార్టీ కాపాడుకోవ‌టం కోసం మ‌ల్కాజ్ గిరి నుంచి బ‌రిలో నిలిచి గెలుపోందారు.. మ‌ల్కాజ్ గిరి ప‌రిధిలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడ లేకున్నా రేవంత్ రెడ్డి గెలుపును టీఆర్ఎస్ అప‌లేక‌పోయింది.

ఇక అంబ‌ర్ పేట స్థానం నుంచి బిజెపి నేత కిష‌న్ రెడ్డి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు.. అయినా తేరుకోని సికింద్రాబాద్ పార్ల‌మెంట్ స్థానం నుంచి ఎంపిగా పోటీ చేసి గెలుపోందారు.. ద‌త్తాత్రేయ‌కు వయ‌స్సు మీద ప‌డ‌టంతో కిష‌న్ రెడ్డి ఇక్క‌డి నుంచి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకుని స‌క్సెస్ అయ్యారు.. అంతేకాదు మోడీ కేబినెట్లో మంత్రిగా అవ‌కాశం ద‌క్క‌నుంద‌న్న ప్ర‌చారం బిజెపిలో న‌డుస్తోంది. అదే జ‌రిగితే కిష‌న్ రెడ్డి జాక్ పాట్ కోట్టిన‌ట్లే అవుతుంది. అదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున నేత‌కాని వెంక‌టేశ్ పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజుల్లోనే వెంక‌టేశ్ గులాబీ గూటికి చేరిపోయారు. టీఆర్ఎస్ ఎంపి అభ్య‌ర్థిగా పెద్ద‌ప‌ల్లి నుంచి పోటీచేసిన నేత‌కాని వెంక‌టేష్ అనుహ్యాంగా గెలుపోందారు.

కాంగ్రెస్ సినియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో న‌ల్గోండ నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ల‌ను బ‌రిలో దించాల‌న్న అలోచ‌న ఉండ‌టంతో ఈ ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి భువ‌న‌గిరి పార్ల‌మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ సెగ్మంట్ నుంచి సోయం బాపురావు కాంగ్రెస్ నుంచి బ‌రిలో నిలిచి ఓట‌మి పాల‌య్యారు.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి బిజెపి నుంచి అదిలాబాద్ ఎంపిగా పోటీ చేసి గెల‌వ‌డం విశేషం. మ‌హాకూట‌మి త‌ర‌పున టిడిపి నుంచి ఖ‌మ్మం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామా నాగేశ్వ‌ర్ర‌రావు పోటీ చేసి గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. ఎన్నిక‌ల‌కు రెండ్రోజుల ముందు గులాబీ కండువా క‌ప్పుకున్న నామా నాగేశ్వ‌ర్రరావు ఖ‌మ్మం ఎంపిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపోందారు.

ఇక క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ సెగ్మంట్ నుంచి బిజెపి త‌ర‌పున బండి సంజ‌య్ పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.. అయినా ప‌ట్టు వ‌ద‌ల‌కుండా క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ నుంచి బిజెపి త‌ర‌పున బ‌రిలో నిలిచారు.. ఇక్క‌డి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపి వినోద్ కుమార్ పై భారీ మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయి ఎంపిలుగా గెలిచిన వీరిలో నామా నాగేశ్వ‌ర్ర రావు మిన‌హాయిస్తే మిగిలిన ఆరుగురు తోలిసారిగా పార్ల‌మెంట్లో అడుగు పెట్ట‌బోతున్న వారే కావ‌డం విశేషం. ఓడిపోయిన కుంగిపోకుండా కొద్ది కాలంలోనే రాజకీయంగా అరుదైన అవకాశాలు దక్కించుకున్నారు ఈ ఏడుగురు నేత‌లు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *