బిగ్‌బాస్‌3 ని ఊపేస్తోన్న ఈ అమ్మ‌డు ఎవ‌రో తెలుసా..

బిగ్‌బాస్‌3 ని ఊపేస్తోన్న ఈ అమ్మ‌డు ఎవ‌రో తెలుసా..

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరికి ఎప్పుడు ఎలా క్రేజ్‌ వస్తుందో చెప్పలేము. సమయాన్ని, సందర్భాన్ని బట్టి పరిస్థితులు మారడం, దానికి తగ్గట్టే కంటెస్టెంట్స్‌ కూడా ప్రవర్తించటంతో ఎవరికి ఎప్పుడు ఫాలోయింగ్‌ పెరుగుతుందో చెప్పడం కష్టం. అయితే తమిళ నాట ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఫీవర్‌ మొదలైంది. ఇలా షో మొదలైన కొద్దిరోజులకే లోస్లియా పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. తన మాట తీరు, చలాకీ తనం, పాటలు పాడుతూ కంటెస్టెంట్లతో పాటు, ప్రేక్షకులను కూడా అలరించడంతో ఆమెకు భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. గత సీజన్‌లో ఓవియాకు ఎంతటి క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇంతటి అనతికాలంలోనే లోస్లియాకు అలాంటి క్రేజ్‌ వచ్చేసింది.

ప్రస్తుతం లోస్లియా గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారట. శ్రీలంకకు చెందిన లోస్లియా మరియనేసన్‌ అక్కడి న్యూస్‌ ఛానల్‌లో యాంకర్‌ పనిచేస్తుంది. లోసియా తన ఆటపాటలతో హౌస్‌లో సందడి వాతావరణం తీసుకురాగా.. ఆడియెన్స్‌ సైతం ఆమెను ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం లోస్లియా పేరిట సోషల్‌ మీడియాలో ఆర్మీ కూడా ఏర్పాటైంది. ఇక ఆమె పాడిన పాటలు, చేసిన డ్యాన్సులు టిక్‌టాక్‌, హలో యాప్‌లో ట్రెండింగ్‌ అవుతున్నాయి. మరి లోస్లియాకు వచ్చిన ఈ క్రేజ్‌ ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. తమిళనాట బిగ్‌బాస్‌ హవా మొదలవ్వగా.. తెలుగులో బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా 14 మంది కంటెస్టెంట్లతో.. వందరోజుల పాటు ఈ షో కొనసాగనుంది. ఉదయభాను, శ్రీ ముఖి, వరుణ్‌ సందేశ్‌, తరుణ్‌ ఇంకా యూట్యూబ్‌ స్టార్లు ఇలా ఓ లిస్ట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మరి ఎవరెవరు ఈసారి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తారో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *