నేటితో ఎన్నికల ప్రచారానికి తెర...

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర...

చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి.దాదాపు నెల రోజుల పాటు హోరాహోరీగా కొనసాగిన ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది.ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. జనంతో కిటకిటలాడిన ప్రధాన కూడళ్లన్నీ బోసిపోనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది.గత నెల రోజులుగా నువ్వానేనా అన్నట్లుగా కొనసాగిన ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది.సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ చివరి రోజు ఎన్నికల ప్రచారంపై ఫోకస్‌ పెట్టాయి.అంతేకాదు…లాస్ట్‌ డే ప్రచారానికి ఫైనల్‌ టచ్‌ ఇచ్చేందుకు పార్టీల అధినేతలు రెడీ అయ్యారు.

ఇదిలా ఉంటే..ఇన్ని రోజుల ప్రచారం ఒక ఎత్తయితే..చివరి రోజు ప్రచారం ఇంకో ఎత్తు.అందుకే లాస్ట్‌ డే క్యాంపెయిన్‌పై పార్టీలన్నీ ఫోకస్‌ పెట్టాయి.తక్కువ సమయంలో ఎక్కువ ఏరియాలు కవరయ్యేలా సభలు,రోడ్‌షోలు నిర్వహించనున్నారు.అలాగే పోలింగ్‌కు ముందు రోజులు అత్యంత కీలకం కావడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

మరోవైపు వరుస సభలు,రోడ్‌షోల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు..చివరిరోజైన ఇవాళ గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.అటు వైసీపీ చీఫ్‌ జగన్‌ సైతం గుంటూరు జిల్లా మంగళగిరి సహా చిత్తూరు,కర్నూలు నియోజకవర్గాల్లో క్యాంపేయినింగ్‌ చేయనున్నారు.కర్నూలులో జరిగే రోడ్‌షోతో జగన్‌ ఎన్నికల ప్రచారం ముగియనుంది.అటు షర్మిళ,విజయమ్మ కూడా రోడ్‌షోలతో ప్రచారానికి ఫైనల్‌ టచ్‌ ఇవ్వనున్నారు.ఇక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా ఇవాళ అమలాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఇటు తెలంగాణలో టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నల్గొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఇప్పటి వరకు గెలుపు ధీమాతో ఉన్న అభ్యర్థులు ఆఖరి నిమిషంలో టెన్షన్‌ పడుతున్నారు.ఓటర్లు ఎక్కడ మనసు మార్చుకుంటారోనన్న భయంతో ఇప్పటికే ఊర్లకు ఊర్లు చుట్టేశారు.ఇక కొద్దిగంటల సమయమే మిగలడంతో అభ్యర్థులు,వారి అనుచరులు చివరిరోజు ప్రచారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారు.ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో వ్యూహ ప్రతివ్యూహాలతో కదులుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *