ఇంకొన్ని గంటల్లో వీరి భవితవ్యం తేలనుంది!

ఇంకొన్ని గంటల్లో వీరి భవితవ్యం తేలనుంది!

ఎట్టకేలకు పోలింగ్ ముగిసిన నలభై రోజుల తర్వాత ఫలితాలు రేపు బయటపడబోతున్నాయి. ఇంకో పన్నెండు గంటల్లో ఎవరు గెలుస్తారో తేలనుంది. అయితే…ఈ ఫలితాలు ఎవరి గెలుపోటములను తేలుస్తుందో పక్కనబెడితే…కొందరి విజయం గురించి తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారు గనక గెలవకపోతే ఇక వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇంతకూ వాళ్లు ఎవరెవరో తెలుసుకుందాం!

2014 ఎన్నికల్లో హిందూపురం స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచిన నందమూరి బాలకృష్ణ. ఈ ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచే మరోసారి బరిలో ఉన్నారు. రేపటి ఫలితాలు బాలకృష్ణకూ…టీడీపీకి చాలా కీలకం అనే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ బాలకృష్ణ గెలిచి..టీడీపీ అధికారంలోకి వస్తే గనక..ఈ సారి బాలయ్యకు క్యాబినేట్‌లో బెర్త్ ఖాయంగా తెలుస్తోంది.

మరొకరు…ఫీర్ బ్రాండ్ రోజా విషయానికొస్తే..గత ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. గతంలో రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం మాత్రం రోజాకు దక్కలేదు. ఇపుడు అదే ‘నగరి’ స్థానం నుంచి ఎమ్మెల్యేగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో రోజా గెలిచి..వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం..రోజాకు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలక మంత్రి పదవి ఇవ్వనున్నారనే టాక్ రాజకీయవర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్..2014 ఎన్నికల ముందే జనసేన పార్టీ పెట్టినా… ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ,టీడీపీ కూటమి మద్దతుని ఇచ్చారు. ఇపుడు మొదటిసారి సార్వత్రిక యుద్ధంలో కమ్యూనిస్టులు, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఏపీలోని గాజువాక నియోజకవర్గంతో పాటు, భీమవరం నుంచి ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అనేది జనసేనానికి చాలా కీలకం. మరోవైపు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు కూడా నర్సాపురం నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఎంపీగా గెలుస్తాడా.. లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *