16 కెమెరాలతో ఎల్‌జీ కొత్త ఫోన్ డిజైన్ !

16 కెమెరాలతో ఎల్‌జీ కొత్త ఫోన్ డిజైన్ !

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ప్రముఖ కంపెనీలన్నీ ఒక కొత్త యుద్ధానికి తెరతీశాయి. స్మార్ట్‌ఫోన్‌లోని సెన్సార్లతో ఈ యుద్ధం మొదలుపెట్టాయి. సామ్‌సంగ్ ఈ మధ్యనే గెలాక్సీ A9 అనే మోడల్‌ని నాలుగు కెమెరాలతో తీసుకొచ్చింది. అయితే ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఎల్‌జీ ఏకంగా 16 కెమెరాలతో కొత్త డిజైన్ తీసుకొచ్చింది. ఈ డిజైన్‌కు పేటేంట్‌ను కూడా పొందింది. సౌత్ కొరియాకు చెందిన ఎల్‌జీ మ్యాట్రిక్స్ లేఅవుట్‌లో 16 కెమెరాలు ఉండే విధంగా అమర్చి ఈ పేటేంట్‌ను సాధించింది.

LG 16 Camera Phone

అద్భుతమైన Face recognition…

ఈ డిజైన్ గురించి వివరిస్తూ… ‘ ఈ డిజైన్ మ్యాట్రిక్స్ ఆకారంలో ఎక్కువ కెమెరాలు కలిగి ఉంటుంది. ఫోన్ యూజర్ ఒక ఫోటోని తనకు కావాల్సిన వివిధ కోణాల్లో తీసుకోవచ్చు. ఎక్కువ కెమెరా సెన్సార్లు ఉండటం మూలంగా Face recognition చాలా బాగా పనిచేస్తుంది. అలాగే, ఈ ఫీచర్ వల్ల ఎవరైనా ఫోటో తీస్తున్నపుడు కదిలినా కూడా ఫోకస్‌తో ఫోటోలను తీస్తుంది ‘ అని ఎల్‌జీ కంపెనీ తెలిపింది. ఏదేమైనా ఈ మొబైల్ వాస్తవ రూపంలోకి వస్తేనే ఏ స్థాయిలో పనిచేస్తుందో చూడగలం.

ఈ మోడల్ ఫోన్‌కు వెనుక భాగంలో అద్దంలాంటి గ్లాస్‌ని కూడా నిర్మించారు. దీన్ని ఉపయోగించి ఒకేసారి 16 కెమెరాలతో సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ఫోన్‌ సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌కు దూరం కాదనీ పేటేంట్‌లో పేర్కొంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *