ఆ కంపెనీల్లో వారానికి నాలుగురోజులే పని!

ఆ కంపెనీల్లో వారానికి నాలుగురోజులే పని!

గత కొన్నేళ్లుగా మనదేశంలో వారానికి ఐదురోజుల పనిదినాల గురించి చర్చించడం పెరిగింది. ఇప్పటికే కార్పోరేట్ కంపెనీల్లో వారానికి ఐదురోజుల పనిదినాలు అమలవుతున్నాయి. అయితే ఈ విధానాన్ని అన్ని సంస్థలకూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అమలు చేసే ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి మరింత మెరుగైన ఫలితాలు రాబట్టివచ్చని కొందరు పరిశొధకులు భావిస్తున్నారు.

ఇక్కడ వారంలో ఐదురోజుల పనిదినాల కోసమే ఇంత పోరాటం జరుగుతుంటే…బ్రిటన్‌లో ఓ కంపెనీ ఏకంగా వారానికి నాలుగురోజులు పనికల్పిస్తోంది. ఆ సంస్థ ఉద్యోగులకు వారంలో మూడు రోజులు విశ్రాంతికి ఇస్తోంది. పైగా జీతంలో ఎలాంటి కోతలు విధించకుండా ఈ సౌలభ్యాన్ని ఇస్తుండటంతో సదరు ఉద్యోగులు సైతం పని విషయంలో ఎంతో హుషారుగా, అద్భుతమైన ఫలితాలను కంపెనీకి ఇస్తున్నట్టు సంస్థ యాజమాన్యం చెబుతోంది. ఆ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవస్తులో అనిపిస్తుంది కదా!

ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌లో ఉన్న పోర్ట్‌కలిస్ అనే లీగల్ కంపెనీ తన ఉద్యోగులకు నాలుగు రోజుల పనిదినాలను కల్పించింది. జీతంలో ఎటువంటి కోత లేకుండా వారానికి ఒకరోజు అదనపు సెలవుని ఇస్తోంది. దీనిపై కంపెనీ డైరెక్టర్ ట్రేవర్ వర్త్ చెబుతూ.. ‘ఉద్యోగులకు నాలుగు రోజుల పనిదినాలే ఉండటం వల్ల ఉత్పాదకత పెరుగిందని, సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగిందని, అలసట వారిలో కనిపించడం లేద’ని చెప్పారు. ప్రాథమిక ఫలితాలను పరిశీలిస్తే తన ఉద్యోగులు గతంతో పోలిస్తే చాలా ఆనందంగా ఉంటున్నారని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నామని వెల్లడించారు. పనిదినాల కుదింపు అనేది ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల ఉద్యోగుల్లో పనితీరు ఎంతో మెరుగుపడుతుందని, ఉద్యోగుల్లో ఒత్తిడి కనిపించడం లేదని ట్రేవర్ తెలిపారు. మరో న్యూజిలాండ్ కంపెనీ ఈ పద్ధతి అనుసరించి 20 శాతం అదనపు ఉత్పాదకతను సాధించిందట. లాభాలు రావడమే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్యం కూడా బాగుంట్టోందట! ఇకనేం…మనదేశంలో కూడా ఇలాంటి సదుపాయం కల్పిస్తే పనికి పని, విశ్రాంతికి విశ్రాంతి కూడా లభించడం ఖాయం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *