ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ రెడీ!... మిగిలిన మొబైల్ కంపెనీలు సైతం ఇదే బాటలో...

ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ రెడీ!... మిగిలిన మొబైల్ కంపెనీలు సైతం ఇదే బాటలో...

సెల్‌ఫోన్లు వచ్చిన కొత్తలో కీప్యాడ్ ఫోన్ల హవా విపరీతంగా ఉండేది. తర్వాత కొన్నాళ్లు ఫ్లిప్ ఫోన్లు వచ్చాయి. అవి కూడా పోయి టచ్, స్మార్ట్‌ఫోన్లు హల్‌చల్ చేస్తున్నాయి. తర్వాత ఏమొస్తాయి అనేదానికి సమాధానంగా ఫోల్డబుల్ ఫోన్లు అని వస్తున్నట్టున్నాయి. మొబైల్ కంపెనీలు ఈ మధ్య వీటిమీదే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ మధ్యనే చైనా కంపెనీ ఒకటి సామ్‌సంగ్ కంటే ముందే ఫోల్డబుల్ ఫోన్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. ఇపుడు కొత్తగా చైనాకే చెందిన మొబైల్ సంస్థ ఒప్పో కూడా పోటీ పడుతోంది. రానున్న ఏడాదిలో తమ కంపెనీ నుంచి ఫోల్డబుల్ ఫోన్ తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. నెదర్లాండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఒప్పో ప్రోడక్ట్ మేనేజర్ చుక్ వాంగ్ ఈ ప్రకటన చేశారు.

oppo portable phone

ఫిబ్రవరి కల్లా..!

ఒప్పో సంస్థ ఫోల్డబుల్ ఫోన్ తయారు చేస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇపుడు సంస్థ మేనేజర్ దీనికి స్పష్టత ఇచ్చారు. 2019, ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరగబోయే వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ ఫోన్‌ను ఆవిష్కరిసున్నట్టు చెప్పారు. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ గురించి మాత్రం చుక్ వాంగ్ చెప్పలేదు.

ఎల్‌జీ కూడా…

వీటితో పాటు ఇంకో చైనా సంస్థ హువావే కూడా ఫోల్డబుల్ ఫోన్‌ల తయారీకి సిద్ధమైనట్టు చెప్తోంది. 2019 జూన్‌లో ఫోల్డబుల్ ఫోన్‌లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్‌జీ కూడా ఈ ఫోన్ తయారీకి రెడీ అవుతున్న సూచనలు కనబడుతున్నాయి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *