ప్రాణాల మీదకు తెచ్చిన భూ వివాదం

ప్రాణాల మీదకు తెచ్చిన భూ వివాదం

కరీంనగర్‌ పట్టణం భగత్ నగర్‌లో ఓ భూ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
సాయిబాబా ఆలయ సమీపంలోని ఓ ప్రైవేటు స్థలంలో శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపడుతుండగా.. కొందరు వ్యక్తులు వచ్చి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో శ్రీనివాస్‌ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని కుటుంబ సభ్యలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *