లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోలేరు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోలేరు

భారతీయ సినిమాలతోనే సంచలన కలిగించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ప్రతి సినిమా మొదలు పెట్టిన దగ్గరి నుంచి రిలీజ్ వరకు తన సినిమా చుట్టూనే మీడియా, ప్రజలూ ఆలోచించేలా వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం వర్మకు అలవాటైన పనే. గతేడాది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అనౌన్స్ చేసి టాలీవుడ్ అంతటిని షేక్ చేశాడు. ఎవరూ ఆలోచించని రీతిలో లక్ష్మీపార్వతి కోణంలోంచి, ఎన్టీఆర్ మరణానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తానని ప్రకంపనలు రేపాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగాయి అనే విషయాల గురించి ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఓటర్లపై ప్రభావం చూపిస్తుందని కొందరు టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి రెండు ట్రైలర్స్ విడుదల చేసిన వర్మ ఈ సినిమాను ఎవరూ ఆపలేరని చెబుతున్నాడు. పైగా ఈ సినిమా పాటలు కూడా విడుదలై ఆసక్తిని రేపడంతో ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూడ్డానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆపేయాలని టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందోనని అందరూ భావించారు.

దీని గురించి వర్మ ఈసీ అధికారి ఏం చెప్పారో తెలియజేసే ఒక ఫోటోను షేర్ చేశారు. మార్చి 22న విడుదల అవబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌ని అడ్డుకోలేమని ఎలక్షన్ కమీషనర్ రజత్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ సినిమా విడుదల తర్వాతే చర్యలు తీసుకోవడం గురించి ఆలోచిస్తామని…ఓటర్లను ప్రభావితం చేసే సన్నివేశాలు ఏవైనా ఉంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈసీ అధికారి తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *