సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న సీనియర్ హీరోయిన్

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న సీనియర్ హీరోయిన్

ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే అందం, అభినయం రెండూ తెలిసుండాలి… అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి గ్లామర్ నే నమ్ముకున్న హీరోయిన్ లక్ష్మీ రాయ్. మంచి హిట్, దానికి తగ్గట్లు ఉండే అందంతో ఇప్పటి వరకూ సినీ అభిమానులని ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఫీమేల్ లీడ్ గా అవకాశాలు రాకపోవడంతో ఐటెం సాంగ్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. అయితే రీసెంట్ గా వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన లక్ష్మీ రాయ్, అది కాస్త ఫ్లాప్ అవడంతో ఒక్కసారిగా చేతిలో సినిమాలు లేక ఖాళీ అయిపొయింది.                  బాలీవుడ్ లో కూడా జూలీ2 సినిమాలో తన గ్లామర్ షోతో లక్ష్మీ రాయ్ ఆకట్టుకుంది కానీ ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో… బీ-టౌన్ నుంచి లక్ష్మీ రాయ్ కి మళ్లీ పిలుపు రాలేదు. అయితే ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న లక్ష్మీ రాయ్, ఇప్పుడు బాగా సన్నబడి దాదాపు జీరో సైజుకి వచ్చింది. దీంతో ఎప్పటి లాగే తన అందాన్ని నమ్ముకున్న లక్ష్మీ రాయ్, సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫోటోలు రిలీజ్ చేసి, తనలో ఇంకా అందం తగ్గలేదని ఇండైరెక్ట్ గా చెప్తోంది. ముఖ్యంగా ఫారిన్ ట్రిప్ నుంచి లక్ష్మీ రాయ్ పోస్ట్ చేసిన బికినీ ఫొటోస్ యూత్ మతి పోగొట్టేలా ఉన్నాయి. ఫొటోలతో యూత్ ని అట్రాక్ట్ చేయడం వరకూ బాగానే ఉంది కానీ ఇవే అవకాశాలు తీసుకురావనే విషయం లక్ష్మీ రాయ్ ఇప్పటికైనా తెలుసుకోని… కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే కెరీర్ కోలుకునే అవకాశం ఉంది, లేదంటే లక్ష్మీ రాయ్ ఫేడ్ అవుట్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *