అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయ్‌... లగడపాటి

అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయ్‌... లగడపాటి

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం అంతకంతకూ వేడెక్కుతుంది. వినూత్నరీతిలో ఉన్న ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. వ్యూహప్రతివ్యూహాల మధ్య రాజకీయ రంగస్థలం మరింత ఆసక్తికరంగా మారింది. ఫలితాలను ఊహిస్తూ చేసిన సర్వేలైతే పెద్ద ఎత్తున అలజడిని రేపుతున్నాయి. చర్చలకూ దారి తీస్తున్నాయి. ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్న ప్రతిఒక్కరూ లగడిపాటి సర్వే గురించీ మాట్లాడుకుంటున్నారు.

లగడపాటి స్పెషాలిటీ…

“సర్వేలయందు లగడపాటి సర్వే వేరయా” అనే ఒక టాక్‌ ఉంది. చేసిన సర్వే ఫలితాలకు అతి చేరువగా ఉండటమే లగడపాటి స్పెషాలిటీ. తెలంగాణా ఎన్నికలపై లగడపాటి సర్వే అంచెలంచెలుగా బయటికి వచ్చింది. తాజా సర్వే బయటకు వచ్చాక, లగడపాటి తెలంగాణా వ్యతిరేఖి అనే విమర్శలు ముందుకొచ్చాయి. ఆ వార్తలపై ఆయన ఘాటుగానే విమర్శించారు.

డిసెంబర్‌ 7న మనసులో మాట

తన సర్వేని బట్టి తెలంగాణా వ్యతిరేఖి అంటూ వస్తున్న వార్తలను లగడపాటి ఖండించారు. ఈ ప్రశ్నలూ, విమర్శలూ… సెప్టెంబర్ 20న టీఆర్ఎస్‌కు అనుకూలంగా సర్వే ఇచ్చినప్పుడు ఎందుకు రాలేదన్నారు. తాను తెలంగాణాకూ, టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకం కాదనీ అన్నారు. తన సర్వే రిపోర్టులు కేటీఆర్‌కూ పంపానని తెలిపారు. ఎన్నికల రోజున డిసెంబర్‌ 7 సాయంత్రం తన మనసులోని మాటను బయటపెడతానని చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *