టీఆర్ఎస్ మేలు కోరి చెప్పాను. అయినా తప్పు పడితే ఎలా?: లగడపాటి

టీఆర్ఎస్ మేలు కోరి చెప్పాను. అయినా తప్పు పడితే ఎలా?: లగడపాటి

లగడపాటి తన సర్వే వివరాలు ప్రకటించిన తర్వాత దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ…చిలకజోస్యంలా ఉందని అన్నారు. దీనికి సమాధానంగా లగడపాటి ఘాటుగా స్పందించారు.

lagadapati survey on telangana elections

ప్రజలు ఎవరికీ శాశ్వతంగా పట్టం కట్టరు…

” సెప్టెంబర్ 16 బంధువుల ఇంట్లో కేటీఆర్‌ను కలిశానని, ఆ సందర్భంగా కేటీఆర్ అడిగితేనే సర్వే వివరాలు మెయిల్ చేశాను అని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్యేల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పాను. ప్రజాఫ్రంట్‌లో కోదండరామ్, సీపీఐలకు ఎక్కువ సీట్లు దక్కితే టీఆర్ఎస్‌కు కలిసి వస్తుందని స్పష్టం చేశాను. ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ ప్రజలు అభ్యర్థులను చూస్తారు. ప్రజలు ఏ ఒక్కరికీ శాశ్వతంగా పట్టం కట్టరు. గతంలో టీడీపీ ఓట్లు టీఆర్ఎస్‌కు వెళ్లాయి. ఇపుడు ఆ ఓట్లు ప్రజాఫ్రంట్‌కి వచ్చాయి. ఎవరు గెలిచినా ఓడినా ప్రజలకు ఒక్కటే. తెలంగాణాకు వ్యతిరేకమైతే కేటీఆర్‌తో ఎందుకు పంచుకుంటాను. టీఆర్ఎస్ మేలు కోరి చెప్పాను, దాన్ని కూడా తప్పు పడితే నేనేం చేయాలి..? ” అన్నారు

11న ఎవరేంటో తెలుస్తుంది!

” నవంబర్ 11న 37 నియోజకవర్గాల్లో గెలుపోటముల గురించి కేటీఆర్‌కు చెప్పాను. ఈ 37 లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయి. దీనికి సమాధానంగా…వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని కేటీఆర్ నాతో చెప్పారు. డిసెంబర్ 11న ఎవరేంటో తెలుస్తుందని నేను చెప్పాను. ఎన్నికల సమయంలో అక్రమంగా అరెస్ట్‌లు చేయించడం కరెక్ట్ కాదనీ కూడా చెప్పాను. “

ఇపుడు పాజిటివ్ కంటే నెగెటివ్ ఎక్కువ కనిపిస్తుంది

” ఆ తర్వాత…నవంబర్ 20 నుంచి వచ్చిన సర్వే వివరాల గురించి కేటీఆర్‌తో చర్చించలేదు. కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వరంగల్‌లో కాంగ్రెస్ అధిక్యంలో ఉంది. ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు ముందు టీఆర్ఎస్‌కే సానుకూలంగా ఉండేది కానీ, ఇపుడు ప్రజాఫ్రంట్‌తో పోటాపోటీ వాతావరణం ఏర్పడింది. ఇలాంటి పోటీ వాతావరణం వచ్చాక ప్రజలు గత ప్రభుత్వం ఏం చేసిందని ఆలోచిస్తారు. పోటాపోటీగా ఉన్నపుడు ప్రజలకు…ఇప్పటిదాకా పాలించిన ప్రభుతంలోని పాజిటివ్ కంటే నెగెటివ్ ముందుగా కనిపిస్తుంది. “

అభ్యర్థులను దిగుమతి చేసుకుంటే కుదరదు…

ప్రజల నాడి పసిగట్టే లాజిక్ నా దగ్గర ఉంది. నేను ఒకరికి లొంగి చెప్పేవాడిని కాదు. ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు. నా వ్యక్తిత్వం, నా మాటలు ముఖ్యం. అక్టోబర్ 28న గజ్వేల్ వెళ్లాను. గజ్వేల్ ప్రాంతంలో ఎవరు గెలుస్తారని ఏడుగురు కానిస్టేబుళ్లను అడిగాను. ‘ పోతారు సర్ ‘ అని సమాధానం చెప్పారు. ఎవరు పోతారనేది తర్వాత చెబుతాను. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి సర్వే చేయలేదు. ఏ పార్టీ అయినా సరైన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే ప్రజలు స్వతంత్రులకు పట్టం కడతారు. ప్రజలకు కావాల్సిన అభ్యర్థులను కాకుండా ఇంకెవరినైనా దిగుమతి చేసుకోవచ్చు, ఎవరినైనా పెట్టొచ్చు అనుకుంటేమటుకు ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానేది మన అంచనాల్లో తేలింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *