అవెంజర్స్ సినిమా చూసి హాస్పిటల్ పాలైంది!

అవెంజర్స్ సినిమా చూసి హాస్పిటల్ పాలైంది!

‘అవేంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తోంది. ఆసక్తికరమైన యాక్షన్, ఫ్యాంటసీ సీన్లతో ఆకట్టుకుంటున్న ఈ సైన్స్‌ఫిక్షన్ చిత్రం చివరిలో వచ్చే ఉద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా ‘ఐరన్ మ్యాన్’ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవ్వుతున్నారట. చైనాలో 21 ఏళ్ల యువతి ఏడ్చి ఏడ్చి ఏకంగా ఆసుపత్రిపాలైందంటే..ఈ సినిమాను ఎంత పిచ్చిగా ఆరాధిస్తున్నారో ఊహించుకోవచ్చు.

మూడు గంటలపాటు నిడివి ఉన్న ఈ సినిమాను చూస్తున్నంత సేపు ఆమె బాగానే ఉంది. క్లైమాక్స్‌లో వచ్చే ఏమోషనల్ సీన్లు చూస్తూ ఏడుపు మొదలు పెట్టింది. గుక్క తిప్పుకోకుండా ఏడ్వడంతో ఆమె కాళ్లు, చేతులు మొద్దుబారిపోయాయి. చాలాసేపు అలా ఏడ్చిన తర్వాత ఛాతి వద్ద నొప్పితో ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ.. ఎక్కువగా రోదించినపుడు శ్వాసను చాలాసార్లు పీల్చి వదులుతారని, దీనివల్ల హైపర్‌వెంటిలేషన్‌కు ఏర్పడి అస్వస్థతకు గురవుతారని తెలిపారు. చికిత్స తర్వాత ఆమెకు మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించామన్నారు. అనంతరం అదే రోజు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తెలియడంతో వైరల్ అయింది. చాలామంది ఆమెకు సానుభూతి తెలుపుతూ.. ‘అవేంజర్స్ ఎండ్‌గేమ్‌’లోని క్లైమాక్స్‌పై తమను కూడా బాధించిందని చెప్పుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *