కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ VS సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ VS సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది. ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఇరవై రెండో మ్యాచ్‌లో మొహలీ వేదికగా ఈ రోజు కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌…

కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌… మొహలీలోని బింద్రా స్టేడియంలో తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌ టూ పేసెడ్‌గా ఉంటుంది. ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌ అధిపత్యమే ఉంటుంది.
170 పైచిలుకు పరుగులతో మ్యాచ్‌ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఒక్క హిట్టర్‌ నిలదొక్కుకున్నా భారీ స్కోర్‌లు చూడొచ్చు. సీమర్లతో పోల్చితే స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. సొంతమైదానం కావడం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం.

మొదటి బ్యాటింగ్‌కే అనుకూలం…

టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటు లోస్కోరింగ్‌, ఇటు హై స్కోరింగ్‌ కాకుండా ఉంటుంది. పిచ్‌ నుంచి స్పిన్నర్లకు కొద్దిపాటి సహకారం ఉంటుంది. 160 నుంచి 170 పరుగుల లోపు సాధించినా పోరు రసవత్తరంగానే ఉంటుంది. సొంత మైదానం కావడం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం. బలమైన జట్టు ఉండటం హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం. మోజో అంచనా ప్రకారం తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకే విజాయవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *