32 స్థానాల్లో కారు జోరు...TRS చరిత్రలోనే ఘన విజయం

32 స్థానాల్లో కారు జోరు...TRS చరిత్రలోనే ఘన విజయం

 

పరిషత్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు చూపించింది.3557 ఎంపీటీసీలు,449 జెడ్పీటీసీల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేశారు.1377 ఎంపీటీసీ,73 జెడ్పీటీసీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.దాదాప 32 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది.చాలా ప్రాంతాల్లో కారు స్పీడ్‌కు హస్తం కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది.దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ మెజార్టీ సీట్లను సాధించింది.ఫలితాల్లో కారు జోరుతో టీఆర్ఎస్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.32 జెడ్పీ పీఠాల మీద గులాబీ జెండా ఎగిరింది.32కు 32 జెడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది.211 ఎంపీటీసీలు,7 జెడ్పీటీసీల్లో కమలం వికసించింది.ఇప్పటి వరకు వెల్లడైన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్‌ఎస్ 3555,కాంగ్రెస్ 1376,బీజేపీ 211,ఇతరులు 592 స్థానాల్లో గెలుపొందారు.జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 428,కాంగ్రెస్ 72,బీజేపీ 7,ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు.ఎంపీటీసీ,జెడ్పీటీసీ అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ గెలవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.

నల్గొండ జిల్లాలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ముగిసింది.మొత్తం 349 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్ఎస్ 191 స్థానాలను కైవసం చేసుకుంది.కాంగ్రెస్ 132 స్థానాల్లో విజయం సాధించిందిబీజేపీ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది.సీపీఎం 5,సీపీఐ,2,ఇతరులు 16స్థానాల్లోగెలుపొందారు.సూర్యాపేట జెడ్పీటీసీ సీటును కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

కేసీఆర్ దత్తత గ్రామం ముల్కనుర్ ,పిచుపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్‌కు షాక్‌ తగిలింది.ఎంపీటీసీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థులు పేసరి జమున- రాజేశం గెలుపొందారు.టీఆర్ఎస్‌ అభ్యర్థి కంటే 376 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ముల్కనూరు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని పేసరి జమున అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *