బాలయ్య కొత్త సినిమా కథ ఇదే…

బాలయ్య కొత్త సినిమా కథ ఇదే…

ఎన్టీఆర్ సినిమా రిజల్ట్ తో డీలా పడిన నందమూరి బాలకృష్ణ… జై సింహ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తో కలిసి… ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే… ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది అదేంటో మీరే చూడండి

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమాపై కాన్సెన్ట్రేట్ చేస్తూ కేఎస్ రవికుమార్ తో ఒక మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. రీసెంట్ గా పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇదొక పొలిటికల్ డ్రామా అని.. ప్రస్తుత రాజకీయాలకు ఈ చిత్రం అద్దం పడుతుందని అంటుంటే మరికొందరు మాత్రం మరికొందరు ఈ చిత్రంలో జగపతి బాబు రోల్.. ఏకంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను పోలి ఉంటుందని చెబుతున్నారు.

అయితే ఈ రూమర్‌ని కొట్టిపారేసిన చిత్ర యూనిట్, ఇదొక కంప్లీట్ కమర్షియల్ చిత్రమని… ఇందులో బాలయ్య ఒక పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నారని, ఇది ఏ వ్యక్తితో ముడిపడదని, అసలు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథ కానే కాదని తేల్చి చెప్తున్నారు… ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలయ్య విభిన్నమైన టు షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారట. ఒకటి పోలీసాఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర కావడం విశేషం. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్.. గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి దారితీసిన పరిస్థితులేంటనేదే ఈ సినిమాకి హైలైట్ పాయింట్ అవుతుందని తెలుస్తోంది. మరి ఇప్పటికే చాలా సార్లు పోలీస్ పాత్రల్లో కనిపించి హిట్స్ అందుకున్న బాలయ్య మరోసారి హిట్ ఇస్తాడేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *