కొరటాల శివ సినిమాతో మెగాస్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇవ్వబోతున్నాడా ?

కొరటాల శివ సినిమాతో మెగాస్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్  ఇవ్వబోతున్నాడా ?

రైటర్‌గానే కాదు దర్శకుడిగా కూడా మంచి సక్సెస్ అయ్యాడు కొరటాల శివ…కథలోనే హీరోయిజం చూపించే ఈ దర్శకుడి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు మెసేజ్‌ను క‌ల‌గ‌లిపి సినిమాని సక్సెస్ అయ్యేలా చేస్తాడు…అందుకే కొరటాల టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ బ్రాండ్ అయ్యాడు.దీంతో కొరటాల డైరెక్షన్‌లో నటించడానికి స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైరా తరువాత ఈ దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

chiranjeevi koratala sivaఅయితే ఫిబ్రవరిలోనే మొదలు కావాల్సింది.కానీ సైరా న‌ర‌సింహారెడ్డి పూర్తి కాక‌పోవ‌డంతో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.మ‌రో రెండు నెల‌ల్లో సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రీక‌ర‌ణ పూర్తి కానుంది.ఈ నేప‌థ్యంలో చిరు,కొర‌టాల సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగం అందుకున్నాయి.మెగా స్టార్ కోసం కొరటాల ఓ సోషల్ మేసేజ్ కథని రెడీ చేశాడట.ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా చిరంజీవి లుక్ టెస్ట్ పూర్తి చేసి ఫోటో షూట్ కూడా చేయించార‌ట ద‌ర్శ‌కుడు.ఈ చిత్రంలో చిరంజీవి రైతు పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌.అంతేకాదు ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నాడన టాక్ వినిపిస్తోంది.మరి ఇప్పటి వరకు నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల ఈ చిత్రంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి..

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *