కొబ్బరి మట్ట రెడీ ఫర్‌ రిలీజ్‌

కొబ్బరి మట్ట రెడీ ఫర్‌ రిలీజ్‌

హృదయ కాలేయం సినిమాలో కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఈ సినిమా తరువాత మొదలు పెట్టిన మూవీ కొబ్బరి మట్ట . 2015 మొదలైనా ఈ సినిమా ఇప్పటికి షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఈ గ్యాప్‌లో సంపూ రెండు మూడు సినిమాలు కూడా చేశాడు . అవేవి కూడా అంతగా మెప్పించలేకపోయ్యాయి. దీంతో మళ్లీ కొబ్బరి మట్ట పై కన్ఫాట్రెషన్ చేశాడు. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు సంపూ. అయితే నాలుగేళ్ళుగా బర్న్ అవుతున్న ఈ బ‌ర్నింగ్ స్టార్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌ం అవుతున్నాడు.. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సంపూ మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో కనిపిస్తూ తనదైన శైలిలో బిల్డప్ ఇస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన సాంగ్స్‌, టీజ‌ర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు సంపూ.. మరి సంపూ అంచనాలను కొబ్బరి మట్ట ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *