కిమ్ రష్యా పర్యటన వెనుక రహస్యం ఏంటి..?

కిమ్ రష్యా పర్యటన వెనుక రహస్యం ఏంటి..?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర చర్చల కోసం ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ రష్యాలో పర్యటిస్తున్నారు. కిమ్, పుతిన్ ల భేటిపై ప్రపంచమంతా ఆసక్తి నెలకొంది. ఇంతకీ వీరిద్దరి భేటిపై ప్రపంచదేశాలు ఎందుకు అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కిమ్ రష్యా పర్యటన వెనుక రహస్యం ఏంటి..? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరి..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాలో పర్యటిస్తున్నారు.బుధవారం మధ్యాహ్నం ఓ ప్రత్యేక రైలులో ప్రతినిధి బృందంతో బయలుదేరిన కిమ్, వ్లాదివోస్తాక్‌లోని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. కాగా ఫిబ్రవరిలో వియత్నాం రాజధాని హానోయిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మలి విడత శిఖరాగ్ర చర్చలు విఫలమైన తర్వాత పుతిన్‌తో కిమ్ ముఖాముఖీ భేటీ కావడం ఇదే తొలిసారి. అణ్వస్ర్తాల ధ్వంసం విషయమై అమెరికాతో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలిగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితరుల మద్దతును కిమ్ కూడగట్టాలని కిమ్ భావించారు.

అనుకున్న సమయం ప్రకారమే పుతిన్ తో భేటి అయ్యారు కిమ్. రష్యా వ్లాదివోస్తోక్‌లోని ఫార్‌ ఈస్ట్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. పుతిన్‌ ఎదురొచ్చి కిమ్‌కు స్వాగతం పలికారు. ఇరువురు కరచాలనం చేసుకుని పలకరింపుల తర్వాత చర్చలు జరిపారు. కాగా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు మద్దతు ఇస్తున్నట్లు పుతిన్‌ తెలిపారు. కొరియాలో శాంతికి ఏం చేయాలో రష్యా అర్థం చేసుకునేందుకు కిమ్‌ పర్యటన దోహదం చేస్తుందని పుతిన్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

ఏదేమైనా 2011లో ఉత్తరకొరియా పగ్గాలు చేపట్టిన నాటినుంచి కిమ్ ఇప్పటివరకు ఆరుదేశాధినేలతో మాత్రమే సమావేశం అయ్యారు. పుతిన్ తో సమావేశమైన ఆరోదేశాధినేతగా పుతిన్ రికార్డుకెక్కాడు. కాగా ఈ భేటీలో ఇరువురు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పుతిన్ అమెరికాకు వ్యతిరేకంగా, ఉత్తరకొరియాకు అనుకూలంగా ఉంటారా..? లేదా..? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *