అందం కోసం సర్జరీ చేయించుకున్న చరణ్ హీరోయిన్

అందం కోసం సర్జరీ చేయించుకున్న చరణ్ హీరోయిన్

హీరోయిన్స్ కి అందంమే పెట్టుబడి! అందుకే ఫేస్ లో ఏ మాత్రం కళ తగ్గినా ఏదో ప్రళయం ముంచుకొచ్చినట్టుగా కలవరపడిపోతారు. ముడుతలు లేని చర్మం కోసం, ఏజ్ కనిపించకుండా ఉండడం కోసం ఎంతగానో ఆరాటం పడతారు.. అయితే జనరల్ గా అందానికి సంబంధిచిన ట్రెయిట్మెంట్స్ ఏజ్ బార్ హీరోయిన్స్ చేయించుకుంటారు కానీ భరత్ అనే నేను సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ట్రీట్మెంట్ చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్వతహాగానే మంచి అందం అభినయం ఉన్న కియారా… చీక్స్ దగ్గర, బుగ్గ ఎముక దగ్గర కొంచెం తేడాగా కనిపించడంతో దాంతో దానిని సరిచేసుకునేందుకు బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంది. ఈ విషయాన్నీ స్వయంగా కియారనే చెప్పడం విశేషం.ట్రీట్మెంట్ తర్వాత కియారా చేసిన మొదటి సినిమా కబీర్ సింగ్. పోస్టర్స్, టీజర్ తో మెప్పించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అర్జున్ రెడ్డి సినిమాలోని ప్రీతీ పాత్రని గుర్తు చేస్తూ షాలిని పాండేని మరిపించేలా కనిపించిన కియారా, బీ-టౌన్ సినీ అభిమానులని ఆకట్టుకుంది. కబీర్ సింగ్ ట్రైలర్ కూడా అర్జున్ రెడ్డి లాగే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, షాహిద్ కపూర్ ముందెన్నడూ చూడనంత కొత్తగా కనిపిస్తున్నాడు కానీ అతన్ని విజయ్ దేవరకొండతో పోల్చకుండా ఉంటే బాగుంటుంది. తన పరిధిలో, నార్త్ ప్రేక్షకులకి ఎలా కావాలో షాహిద్ అలానే చేశాడు. సో టఫ్ గయ్ యాటిట్యూడ్ తో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ కి ఊపు తెస్తే, కొత్త అందంతో కియారా యూత్ హృదయాలని కొల్లగొడుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *