ఎన్నికలు ఎన్నికలే...దోస్తీ దోస్తీనే!

ఎన్నికలు ఎన్నికలే...దోస్తీ దోస్తీనే!

ఇది ఐకమత్యం గురించి మాట్లాడుకునే సంఘటన.సిద్ధాంతాలు వేరైనా స్నేహం ఒకటే అని చెప్పిన సందర్భం.దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.ఒకవైపు ప్రాంతీయ పార్టీల దూకుడు,మరోవైపు మోదీ హవా, ఇంకోవైపు కాంగ్రెస్, వామపక్షాల జోరు. విమర్శలు, ప్రతివిమర్శలు…నాయకుల సంగతి ప్రత్యెకంగా చెప్పక్కరలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ నాయకులందరూ ఒక్కటే అవుతారు.కార్యకర్తలు,ప్రజలే వచ్చిన ప్రభుత్వం ఏదో చేసేస్తుందని ఎదురు చూస్తూ కాలం వెల్లదీస్తారు. ఎందుకంటే నాయకుల లాగా వారు కలిసిపోలేరు. భావోద్వేగం అంత త్వరగా చల్లారదు. వారి మధ్య ఈ విమర్శలు వ్యక్తిగత దూషణల దాకా వెళ్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల కన్నా పార్టీనే ముఖ్యమనేలా ప్రవర్తిస్తారు. చివరకు రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. వారిని నమ్మినందుకు కార్యకర్తలు, అభిమానులే బలవుతారు. అయితే…ఈ ఎన్నికల్లో ఓ ప్రత్యేకమైన సంఘటన ఒకటి జరిగింది. దాని గురించి తెలుసుకుందాం..!

కేరళలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయితే తాము గతంలోలానే ఇప్పుడు కూడా కలిసి ఉన్నామంటూ కొందరు యువకులు కారు లోపల,వెనుక డిక్కీలో కూర్చొని కాంగ్రెస్,బీజేపీ,సీపీఐ,సీపీఎం జెండాలు పట్టుకుని రాజకీయ పార్టీల సిద్ధంతాలు వేరైనా కూడా తమ ఫ్రెండ్ షిప్ మాత్రం చెదిరిపోదని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. నిజమైన ఫ్రెండ్‌షిప్ అంటే ఇదేనని, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ ఫొటోపై ఫన్ కామెంట్స్ చేస్తున్నారు.నాయకులు బాగానే ఉంటారు మనలో మనమే వాళ్ల కోసం కొట్టుకుని చావాలి..ఈ ఫొటో చూసైనా ఇకముందు మార్పు వస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజమైన ఇన్ క్రెడిబుల్ ఇండియా అంటే ఇదే,ఎన్నికలు ముగిశాయి కానీ ఫ్రెండ్ షిప్ ఎప్పటికీ ముగిసిపోదు అంటూ ఫోటోను షేర్ చేస్తూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *